Military Expenditure: తగ్గేదేలే.. ఆ విషయంలో అమెరికా, చైనా తర్వాత ఇండియానే..!

|

Apr 25, 2022 | 1:18 PM

Military Expenditure: ప్రపంచ దేశాలన్ని కరోనా వల్ల నానా ఇబ్బందులు పడుతుంటే కొన్ని దేశాలు మాత్రం సైన్యం కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసర్చ్‌

Military Expenditure: తగ్గేదేలే.. ఆ విషయంలో అమెరికా, చైనా తర్వాత ఇండియానే..!
World Military
Follow us on

Military Expenditure: ప్రపంచ దేశాలన్ని కరోనా వల్ల నానా ఇబ్బందులు పడుతుంటే కొన్ని దేశాలు మాత్రం సైన్యం కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (SIPRI) నివేదిక ప్రకారం.. గతేడాది అమెరికా సైన్యం కోసం భారీగా ఖర్చు చేసింది. తర్వాత స్థానంలో చైనా ఉండగా మూడో స్థానంలో భారత్ నిలిచింది. 2021లో అంతర్జాతీయ సైనిక వ్యయం 2113 బిలియన్‌ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. 2020తో పోలిస్తే ఈ వ్యయం 0.7శాతం ఎక్కువ. 2021లో అమెరికా, చైనా, భారత్‌, యూకే, రష్యా దేశాలు మిలటరీ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన ఐదు దేశాలు. ప్రపంచ సైనిక వ్యయంలో కేవలం ఈ ఐదు దేశాలే 62 శాతం ఖర్చు చేశాయి. అమెరికా 2021లో 801 బిలియన్‌ డాలర్లు సైన్యంపై వెచ్చించింది. ఇది 2020తో పోలిస్తే 1.4శాతం తగ్గింది. తర్వాత చైనా 293 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. 2020తో పోలిస్తే 4.7శాతం పెరిగింది.

భారత్‌ విషయానికి వస్తే.. 76.6బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. 2020తో పోలిస్తే 0.9శాతం పెంచింది. కానీ 2012తో పోల్చితే మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఏకంగా 33శాతం పెరగడం విశేషం. ప్రస్తుతం దేశం ఆయుధాల కొనుగోలుకే ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఇక యూకే గతేడాది 68.4 బిలియన్‌ డాలర్లను సైన్యం కోసం ఖర్చు చేయగా రష్యా 65.9 బిలియన్‌ డాలర్లని ఖర్చు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: కృనాల్‌ పాండ్య ముద్దులు.. కోపంతో తిరస్కరించిన పొలార్డ్‌..!

Health Tips: మీ కుటుంబంలో షుగర్‌ పేషెంట్లు ఉన్నారా.. అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Viral Video: ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. కొంచెముంటే ప్రాణాలు పోయేవి..!