Drugs: పాకిస్తాన్ నుంచి భారత్‌కు డ్రగ్స్.. గుజరాత్ తీరంలో రూ.280 కోట్ల హెరాయిన్ పట్టివేత..
Drugs seized in Gujarat: గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ తీరం నుంచి అక్రమంగా భారత్‌లోకి డ్రగ్స్ రవాణా చేస్తున్న పాకిస్తాన్ వాసులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కోస్టల్ గార్డ్స్
Drugs seized in Gujarat: గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ తీరం నుంచి అక్రమంగా భారత్‌లోకి డ్రగ్స్ రవాణా చేస్తున్న పాకిస్తాన్ వాసులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కోస్టల్ గార్డ్స్ సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బోటులో ఉన్న 9 మంది పాకిస్తాన్ వాసులను అరెస్టు చేసినట్లు గుజరాత్ ఎటిఎస్ వెల్లడించింది. సోమవారం ఉదయం రాష్ట్ర తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో పాకిస్తాన్ బోట్‌లో ఉన్న తొమ్మిది మందిని పట్టుకుని రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేసినట్లు ప్రకటించింది.
పాకిస్తాన్‌కు చెందిన ‘అల్ హజ్’ అనే బోటు అక్రమంగా భారత జల భాగంలోకి ప్రవేశించిందని.. దీంతో భారత తీర రక్షక దళ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. తదుపరి విచారణ కోసం పడవతో పాటు 9మంది నిందితులను గుజరాత్ కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తరలించినట్లు తెలిపారు.
In a joint Ops with ATS #Gujarat, @IndiaCoastGuard Ships apprehended Pak Boat Al Haj with 09 crew in Indian side of Arabian sea carrying heroin worth approx 280 cr. Boat being brought to #Jakhau for further investigation. @DefenceMinIndia @MEAIndia @HMOIndia @SpokespersonMoD
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 25, 2022
ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది గుజరాత్ తీరంలోని జాఖావో ఫిషింగ్ హార్బర్ సమీపంలో పడవ ద్వారా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నారనే సమాచారంతో కోస్ట్ గార్డ్, ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: