ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. సంవత్సరంలో ఎంత రక్తాన్ని దానం చేయవచ్చు..? దాని ప్రయోజనాలు, సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటి? తప్పనిసరిగా తెలుసుకోండి

|

Jun 13, 2024 | 6:22 PM

2024 ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశ్యం రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహించడం. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. మీరు చేసే రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి జీవితాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి సంవత్సరంలో ఎంత రక్తాన్ని దానం చేయవచ్చు..? దాని వల్ల లాభనష్టలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. సంవత్సరంలో ఎంత రక్తాన్ని దానం చేయవచ్చు..? దాని ప్రయోజనాలు, సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటి? తప్పనిసరిగా తెలుసుకోండి
Donating Blood
Follow us on

ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వంగా జరుపుకుంటారు. ఈ రోజు నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ ల్యాండ్‌స్టీనర్ పుట్టినరోజు. కార్ల్ ల్యాండ్‌స్టైనర్ ABO బ్లడ్ గ్రూప్ సిస్టమ్‌ను కనుగొన్న శాస్త్రవేత్త. అతని ఆవిష్కరణకు ముందు ఈ రక్త మార్పిడి గ్రూప్‌ తెలియకుండా జరిగింది. రక్తదానం చేయడాన్ని గొప్ప దానం అంటారు. అందువల్ల రక్తదానం అన్ని చోట్లా ప్రోత్సహించబడుతుంది. ఈ ప్రత్యేక రోజున రక్త శిబిరాలు నిర్వహిస్తారు. మీరు కూడా రక్తదానం చేయాలనుకుంటే మీ వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. బరువు కనీసం 46 కిలోలు ఉండాలి. హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములు ఉండాలి. ఒక వ్యక్తి రక్తదానం చేయాలనుకుంటే దానికి ముందు కొన్ని పరీక్షలు చేస్తారు. టెస్ట్‌ రిపోర్ట్‌ల ప్రకారం ఆ వ్యక్తి రక్తదానం చేయవచ్చా లేదా అనేది నిర్ణయించబడుతుంది.

రక్తదానంలో ఒక్కోసారి 300 నుంచి 400 మి.లీ.ల రక్తం తీసుకుంటారు. ఇది శరీరంలోని మొత్తం రక్తంలో 15వ వంతుగా తీసుకోబడుతుంది. రక్తదానం చేసిన తర్వాత శరీరం తిరిగి రక్తాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు మీ ఆహారపు అలవాట్లు, సరైన ఆహారం తీసుకుంటే..24 గంటల్లో మళ్లీ కొత్త రక్తం ఏర్పడటం ప్రారంభమవుతుంది.

మనం రక్తదానం ఎందుకు చేయాలి..?

ఇవి కూడా చదవండి

మన శరీరంలో ఉండే ఎర్రరక్తకణాలు 90 నుంచి 120 రోజుల్లో వాటంతట అవే చనిపోతాయి. అందుకే ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేస్తూనే ఉండాలని చెబుతారు. మీ రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి జీవితాన్ని అందిస్తుంది.

ఒక వ్యక్తి మూడు నెలల వ్యవధిలో రక్తదానం చేయాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ 12 కంటే తక్కువ ఉన్న వ్యక్తులు రక్తదానం చేయడానికి అనర్హులుగా చెబుతున్నారు. ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో లేదా ఏదైనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటే, అతను రక్తదానం చేయడానికి అవకాశం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ఇది వారి ఆరోగ్యం, భద్రతకు మంచిది.

ఈ వ్యక్తులు రక్తదానం చేయలేరు..

అధిక లేదా తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు రక్తదానం చేయకూడదు. టిబి రోగులు కూడా రక్తదానం చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందనే భయం ఉంది. ఎయిడ్స్ రోగులు కూడా రక్తదానం చేయకూడదు. అందువల్ల రక్తదానం చేసే ముందు దాతకు రక్తపరీక్ష నిర్వహించి రక్తదానం చేసే వ్యక్తికి ఎలాంటి జబ్బు లేదని నిర్ధారించుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..