మద్యం మత్తులో యువతి వీరంగం.. నా ఇష్టం వచ్చింది చేసుకుంటానంటూ పోలీసులను కాళ్ళతో తన్నిన యువతి

|

Dec 06, 2020 | 4:26 PM

మద్యం మత్తులో యువతీ వీరంగం. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులను కాళ్ళతో తన్నింది.

మద్యం మత్తులో యువతి వీరంగం.. నా ఇష్టం వచ్చింది చేసుకుంటానంటూ పోలీసులను కాళ్ళతో తన్నిన యువతి
Follow us on

చెన్నై: చెన్నైలోని అడియార్‏లో మద్యం మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నా ఇష్టం వచ్చింది చేసుకుంటానంటూ పోలీసులతో గొడవకు దిగింది. అంతేకాకుండా పోలీసులను కాళ్ళతో తన్నింది. ఆమె పక్కన ఉన్న యువకుడు వారిస్తున్నా ఆ అమ్మాయి వినకపోవడంతో.. అడియార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఆ యువతీ పోలీసులను తిడుతున్న సన్నివేశాలను అక్కడున్న వారు సెల్ ఫోన్‏లో వీడియో తీయడంతో అవి  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.