Watch Video: సీట్ కోసం తన్నుకున్న మహిళలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Trending Video: జనరల్ బస్సు, రైలులో సీటు దొరకడం కొన్ని సందర్భాల్లో అతికష్టంగా మారుతుంది. సీట్ కోసం కిటీకిలో నుంచి బ్యాగ్, కర్చీఫ్ వంటివి వేస్తుంటారు. అయినా సీట్ దొరకని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలోనే అనుకోకుండా..

Watch Video: సీట్ కోసం తన్నుకున్న మహిళలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Spot Visuals

Updated on: Jul 27, 2023 | 1:29 PM

Trending Video: జనరల్ బస్సు, రైలులో సీటు దొరకడం కొన్ని సందర్భాల్లో అతికష్టంగా మారుతుంది. సీట్ కోసం కిటీకిలో నుంచి బ్యాగ్, కర్చీఫ్ వంటివి వేస్తుంటారు. అయినా సీట్ దొరకని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలోనే అనుకోకుండా ప్రయాణికుల మధ్య సీట్ కోసం వాగ్వాదం కూడా జరుగుతుంటుంది. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో జరిగింది. బస్ సీటు కోసం ఇద్దరు మహిళలు చితకబాదుకొన్న వీడియో అది. దానిలో ఇద్దరు మహిళలు తన్నుకోవడాన్ని మీరు చూడవచ్చు.

వైరల్ వీడియోకి క్యాప్షన్ ఆధారంగా ఈ వీడియో కర్ణాటకలోని లోకల్ బస్సులో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఒకరి జట్టు మరొకరు పట్టుకుని తన్నుకున్నారు. వీరిద్దరినీ విడదీసేందుకు మధ్యలో వచ్చిన వ్యక్తిని కూడా సదరు మహిళలు వెనక్కు నెట్టడం వైరల్ వీడియోలో కనిపిస్తుంది. Prajavani అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో గొడవ పడడం మాత్రమే కనిపించింది. కానీ గొడవ ఎలా ముగిసింది.. బస్సు కండక్టర్ ఏమైనా స్పందించాడా అనేది తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

కాగా, వైరల్ అవుతున్న ఈ బస్సు సీట్ గొడవ గురించి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్రీ సీట్ కోసం ఫ్రీ వినోదం.. మహిళాశక్తి.. ఇలాంటి గొడవలు జరగకూడదు కానీ జరిగితే చాలా సరదాగా ఉంటుందని కొందరు రాసుకొచ్చారు. మరోవైపు ఈ వీడియోకి ఇప్పటివరకు 1 లక్షా 5 వేల వీక్షణలు లభించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.