శీతాకాలపు ఎండను ఆస్వాదిస్తూ.. ఓ మహిళ ఆరుబయట తిరుగుతుంది. వెచ్చటి ఎండలో చలి నుంచి ఉపశమనం పొందుతూ హాయిగా అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తోంది. అంతలోనే ఆమెకు ఊహించని సంఘటన ఎదురైంది. ఒంటరిగా వాకింగ్ చేస్తున్న మహిళను ఓ దుండగుడు అడ్డుకున్నాడు. తుపాకీతో బెదిరించి, ఆమె వద్ద ఉన్న బంగారం, అంతలోనే వచ్చిన ఆమె కుమారుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.
ఘజియాబాద్‌లోని డీఎల్ఎఫ్ అంకుర్ విహార్ కాలనీలో నివసిస్తున్న అశోక్ గుప్తా, తన భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. గుప్తా భార్య గీత.. చలిని తట్టుకోలేక సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. ఒకరు బైక్ దిగి.. తుపాకీతో మహిళను బెదిరించారు. దీంతో ఆమె వద్ద ఉన్న బంగారం ఇచ్చేసింది. పక్కనే ఉన్న కుమారుడిని కూడా బెదిరించి, అతని వద్ద మొబైల్‌ను దొంగిలించారు.
ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితురాలు గీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి