Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తను చంపి, నగలతో కోడలు జంప్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు..!

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన 54 ఏళ్ల మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలి కోడలు, ఆమె సోదరిని అరెస్టు చేశారు. ఝాన్సీ ప్రాంతానికి చెందిన సుశీలా దేవిని ఆమె కోడలు పూజ, కమ్లా కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత పారిపోతున్న కమ్లా ప్రియుడు అనిల్ వర్మను పోలీసులు ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టు చేశారు.

అత్తను చంపి, నగలతో కోడలు జంప్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు..!
Woman Kills Mother In Law
Balaraju Goud
|

Updated on: Jul 03, 2025 | 8:27 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన 54 ఏళ్ల మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలి కోడలు, ఆమె సోదరిని అరెస్టు చేశారు. ఝాన్సీ ప్రాంతానికి చెందిన సుశీలా దేవిని ఆమె కోడలు పూజ, కమ్లా కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత పారిపోతున్న కమ్లా ప్రియుడు అనిల్ వర్మను పోలీసులు ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ సుశీలా దేవి హత్యకు కుట్ర పన్నారని, ఝాన్సీలోని బాధితురాలి ఇంటి నుంచి రూ.8 లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించినట్లు అంగీకరించారని పోలీసు సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర కుమార్ తెలిపారు.

అనిల్ వర్మ దొంగిలించిన నగలను బంధువుకు అమ్మడానికి వెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల తనిఖీలో భాగంగా అతని బైక్ ఆపినప్పుడు, వర్మ పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు తిరిగి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వర్మను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.

జూన్ 24వ తేదీన కుంహారియా గ్రామంలోని తన ఇంట్లో సుశీలా దేవి మృతి చెంది కనిపించడంతో హత్య వెలుగులోకి వచ్చింది. పూజా తన వాటాను అమ్మేసి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్లాలని అనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ కుటుంబానికి సమిష్టి భూమి ఉంది. పూజా మరిది సంతోష్, మామ అజయ్ పూజా నిర్ణయానికి అంగీకరించగా, సుశీలా దేవి వ్యతిరేకించారు. భూమిని అమ్మేయాలనే ఆమె ప్రణాళికలో భాగంగాచివరి అడ్డంకిని తొలగించడానికి సుశీలా దేవిని పూజా హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

తన భర్త మరణం తర్వాత పూజా, ఝాన్సీలో సుశీలా దేవి చిన్న కుమారుడు కళ్యాణ్ సింగ్‌తో సహజీవనం చేసిందని పోలీసులు తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం కళ్యాణ్ సింగ్ మరణించినప్పుడు, సుశీలా దేవి మరో కుమారులు సంతోష్, అజయ్ కలిసి పూజను కుంహారియా గ్రామానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పూజ సంతోష్‌తో ప్రేమ వ్యవహారం ప్రారంభించింది. అతని ద్వారా ఆమెకు ఒక కూతురు పుట్టింది. సంతోష్ భార్య రాగిణి వారి ప్రేమను వ్యతిరేకించి తొమ్మిది నెలల క్రితం తన తల్లి ఇంటికి వెళ్లిపోయిందని ఎస్పీ కుమార్ తెలిపారు. విచారణ సమయంలో పూజా, తన సోదరి పూజ, ఆమె ప్రియుడు అనిల్ వర్మతో కలిసి సుశీలా దేవి హత్యకు కుట్ర పన్నింది. అరెస్టు కావడానికి ముందు అతను పరారీలో ఉన్నాడని పోలీసు అధికారి తెలిపారు.

ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా అనిల్ వర్మ తప్పించుకునేందుకు యత్నించాడు. పైగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. అయితే, ఎన్‌కౌంటర్ తర్వాత అనిల్ వర్మ ఉపయోగించిన నగలు, తుపాకీ, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.