Leopard Attack: మధ్యప్రదేశ్‌లో దారుణం.. తునికాకు కోసం వెళ్లిన మహిళ మృతి.. భర్త కళ్లముందే భార్యను లాక్కెళ్లి చంపిన చిరుతపులి

|

May 17, 2021 | 3:21 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. తన భర్తతో కలిసి తునికాకు సేక‌ర‌ణ కోసం వెళ్లిని ఓ మహిళను చిరుత పొట్టనబెట్టుకుంది.

Leopard Attack: మధ్యప్రదేశ్‌లో దారుణం.. తునికాకు కోసం వెళ్లిన మహిళ మృతి.. భర్త కళ్లముందే భార్యను లాక్కెళ్లి చంపిన చిరుతపులి
Woman Killed In Leopard Attack
Follow us on

Leopard Kills Woman:మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. తన భర్తతో కలిసి తునికాకు సేక‌ర‌ణ కోసం వెళ్లిని ఓ మహిళను చిరుత పొట్టనబెట్టుకుంది. గ్రామ‌స్తుల‌తో క‌లిసి వెళ్లిన ఓ మ‌హిళ‌పై చిరుత‌పులి దాడిచేసి చంపేసింది. రాష్ట్రం సియోని జిల్లా కియోల‌రీ బ్లాక్ ర‌త‌న్‌పూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం… ర‌త‌న్‌పూర్ గ్రామానికి చెంద‌ని 45 ఏళ్ల మ‌హిళ త‌న భ‌ర్తతోపాటు మ‌రికొంద‌రు గ్రామ‌స్తుల‌తో క‌లిసి తునికాకు సేక‌ర‌ణ కోసం స‌మీప అడ‌విలోకి వెళ్లింది. ఇంతలో ఒక్కాసారిగా చిరుతు వారిపై దాడి చేసింది. ఇదే క్రమంలో ఆ మ‌హిళ‌పై చిరుత‌పులి దాడి చేసింది. అంతేగాక ఆమెను అర కిలోమీట‌ర్ దూరం ప్రాణాలతోనే లాక్కెళ్లి చంపేసింది.

ముందుగా మ‌హిళ అరుపులు విని అటుగా ప‌రుగుతీసిన త‌న భ‌ర్త, గ్రామ‌స్తుల‌కు ఆమె క‌నిపించ‌లేదు. కానీ ఘ‌ట‌నా ప్రాంతంలో ర‌క్తం అంటిన మొబైల్ ఫోన్ మాత్రమే ల‌భ్యమైంది. దీంతో అంద‌రూ క‌లిసి చుట్టుప‌క్కల వెతుక‌గా అర కిలోమీట‌ర్ దూరంలో ర‌క్తపు మ‌డుగులో మ‌హిళ మృత‌దేహం ల‌భ్యమైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు. అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also…  CORONA SECOND-WAVE: చిన్నారులపై కరోనా పంజా.. తొలి వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్ మరింత దారుణం.. లెక్కలివే!