Watch Video: గర్బా డ్యాన్స్‌ చేస్తుండగా సడెన్‌ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..

ఇంటిపై దాడి చేసి.. అడ్డొచ్చిన వాళ్లను చితకబాది.. కిడ్నాప్‌ చేయడం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ మధ్యప్రదేశ్‌లో రియల్‌గానే జరిగింది. అంతా చూస్తుండగానే ఓ మహిళను కిడ్నాప్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ మహిళ సినీ ఫక్కీలో కిడ్నాప్‌ అయింది.

Watch Video: గర్బా డ్యాన్స్‌ చేస్తుండగా సడెన్‌ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..
Woman Kidnap

Updated on: Sep 22, 2025 | 9:20 AM

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ మహిళ సినీ ఫక్కీలో కిడ్నాప్‌ అయింది. ఖాన్‌పురాలోని భావ్‌సర్ ధర్మశాలలో మహిళలు, యువతులు గర్బా డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడకు వచ్చారు. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఒక మహిళను పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్‌ అయ్యారు. వారి నుంచి ఆ మహిళను కాపాడేందుకు ఒక యువతి ప్రయత్నించింది. అయితే ఆ గుంపులోని ఒక మహిళ ఆమెను తోసేసింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వారంతా కలిసి ఆ మహిళను కిడ్నాప్ చేశారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కిడ్నాప్‌పై సమచారం అందుకున్న పోలీసులు.. చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. చివరకు ఆ వాహనాన్ని గుర్తించి అడ్డుకున్నారు. వారి చెర నుంచి ఆ మహిళను రక్షించారు. ఆమె కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఇద్దరు మహిళలతో సహా ఎడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  గరోత్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలి భర్త మద్యానికి బానిస కావడంతో అతని నుంచి దూరంగా ఉంటూ మరో వ్యక్తితో సహజీవనం చేస్తుందని.. అందుకే ఆమెను కుటుంబ సభ్యులు కిడ్నాప్‌ చేసి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..