Baby with Four Hands and Legs: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి కలియుగంలో జరిగే వింతలు, విశేషాల గురించి కాలజ్ఞానంలో చెప్పినట్లు.. ఎక్కడోచోట ఏదోక మూల వింత సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి, చింత చెట్టుకి చామంతి పూలు, పందికి ఆవు దూడ, ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, మూడు కళ్ళతో శిశువు జననం ఇలా ఏదోక వింత సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలు జన్యులోపాలతో అని శాస్త్రజ్ఞులు అంటే.. భగవంతుడి లీల అని భక్తులు అంటారు. తాజాగా ఓ మహిళ నాలుగు కాళ్ళు, నలుగు చేతులతో ఓ శిశివుకి జన్మనిచ్చింది. ఈ వింత శిశువు బీహార్ లో జన్మించింది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లోలి కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది ఈ వింత సంఘటన. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళ బీహార్‌లోని కతిహార్ సదర్ ఆసుపత్రిలో నాలుగు చేతులు, కాళ్లు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు వింతగా జన్మించిన విషయం ఆనోటా ఈ నోటా ప్రజలకు తెలియడంతో.. స్తానికులు ఆస్పత్రికి వద్దకు భారీగా జనం ఎగబడ్డారు. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. భార్యకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం తెలిసి భార్య షాక్‌కు తిన్నాడు.
అసాధారణ నవజాత శిశువు జననం పై వైద్యులు స్పందిస్తూ.. వాస్తవానికి ఆ మహిళ కవలలకు జన్మనివ్వాల్సి ఉందని, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అయితే వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ గర్భంతో ఉండగా.. అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్టులో ఈ వైకల్యాల గురించి ఎన్నడూ వెల్లడి కాలేదని.. కడుపులో ఉన్న నవజాత శిశువు పరిస్థితి గురించి వైద్యులు తమకు ఏమీ చెప్పలేదని బంధువులు తెలిపారు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: నలుగురు పిల్లలతో పవన్ కళ్యాణ్.. నెట్టింట్లో వైరల్.. కనులకు విందు అంటున్న ప్యాన్స్..