Watch Video: స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. గాలిలో పల్టీలు కొట్టిన మహిళ.. షాకింగ్ వీడియో

స్కూటర్‌ను కారు ఢీకొపడంతో పిలియన్ రైడర్‌ను గాలిలో చక్కర్లు కొడుతూ చాలా దూరంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి.

Watch Video: స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. గాలిలో పల్టీలు కొట్టిన మహిళ.. షాకింగ్ వీడియో
Kerala Shocking Accident Video

Updated on: Aug 22, 2022 | 11:52 AM

మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోవడం చాలాసార్లు చూశాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు టైం బాగోలేకపోతే మన చేతుల్లో ఏం ఉండదు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఎంతో భయపెడుతోంది. నిజయంగా ఈ వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వాలిందే. కేరళలోని మలప్పురంలో స్కూటర్‌ను కారు ఢీకొట్టడంతో ఓ మహిళ గాలిలో ఎగురుతూ చాలాదూరంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు అబ్దుల్ ఖాదర్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వీరి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటీ వెనుక సీట్లో కూర్చొన్న ఖాదర్ భార్య బంతిలా గాలిలో ఎగురుతూ పడిపోవడం వీడియోలో చూడొచ్చు. రుకియా ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కారు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఖాదర్ వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కాగా ఖాదర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

యూఏఈలో పనిచేస్తున్న అబ్దుల్ ఖాదర్ కొద్దిరోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఖాదర్, అతని భార్య రుకియా తవనూరులో బంధువుల వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం సాయంత్రం కుట్టిపురం-తిరూర్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్ల ఒళ్లు జలదరించేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us