తమిళనాడులో సినిమా తరహా క్రైమ్ స్టోరీ వెలుగుచూసింది. మహిళపై ఇనుప రాడ్‌తో దాడి చేసి నగలు చోరీ చేసిన కేసులో విచారణ చేస్తున్న పోలీసులు అసలు నిందితులు ఎవరో తెలిసి స్టన్ అయ్యారు. సీసీ విజువల్స్ ఆధారంగా.. పోలీసులు విచారణ చెయ్యడంతో.. కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అత్తను పాశవికంగా హత్య చేసి.. దోపిడి దొంగలు ఆమెను నగల కోసం చంపేసినట్లుగా చిత్రీకరించింది కోడలు.తిరునల్వేలిలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
సీతాలక్ష్మి , మహాలక్ష్ష్మి.. అత్తాకోడళ్లు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సీతాలక్ష్మిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి ఓ దుండగుడు నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నగల కోసం జరిగిన దొంగతనంగా ముందు విచారణ ప్రారంభించారు పోలీసులు. అయితే సీసీ విజువల్స్ ద్వారా ఆ వచ్చిన దుండగుడు.. మగ వ్యక్తి కాదని.. మహిళ అని పోలీసులు నిర్దారించుకున్నారు. మహిళ.. పురుషుల దుస్తులు, హెల్మెట్ ధరించి మగ వ్యక్తిగా కనిపించేందుకు ప్రయత్నించడంతో వారికి కొత్త అనుమానం మొదలైంది. తొలుత ఇరుగుపొరుగున ఉండేవారిని విచారించగా.. అత్తాకోడళ్లకు అరక్షణం కూడా పడదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కోడలిని పిలిచి.. తమదైన స్టైల్లో విచారించడంతో.. ఆమె అసలు నిజం ఒప్పుకుంది. తనని అస్తమానం అత్త తిడుతుందని, తనకు భర్తకు మధ్య విబేధాలు సృష్టిస్తున్నందున హత్య చేసినట్లు ఒప్పుకుంది. అందుకే హత్య చేసి నగల కోసం జరిగినట్టుగా అందరిని నమ్మించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో కోడలు మహాలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Woman disguised herself by wearing helmet to trespass into her mother-in-law’s house and fatally beat her with iron rod in the early morning. Tirunelveli’s Seethaparpanallur police arrested her. Victim & suspect were residing in different houses in same street. pic.twitter.com/7V5LPeUCR8
— Thinakaran Rajamani (@thinak_) May 30, 2023
Daughter in law – mother-in-law
మరిన్ని జాతీయ వార్తల కోసం