
డిన్నర్ చేస్తూ చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ 27 ఏళ్ల మహిళ మరణించిన ఘటన మహారాష్ట్రాలోని పాల్గఢ్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాల్గఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళ డిన్నర్ చేద్దామని శుక్రవారం రాత్రి తన భాయ్ ఫ్రెండ్‌తో కలిసి స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇక వారు ఫుడ్ ఆర్డర్ చేసుకొని భోజనం చేస్తుండగా మహిళ గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుపోయింది. దీంతో అమెకు ఊపిరాడక అక్కడికక్కడే కుప్ప కూలింది. ఇది గమనించిన తన ప్రియుడు వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించాడు. అయితే అక్కడ మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్టు నిర్థారించారు.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రస్తుతానికి ఇది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మహిళ మృతికి గల కారణాలు తెలుసుకొని ముందుకెళ్తామని తెలిపారు. ఇక మహిళ మృతికి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కోవడమే కారణమా లేదా మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..