సీఏఏ వ్యతిరేక సభలో “పాకిస్థాన్ జిందాబాద్” స్లోగన్స్.. పక్కనే అసదుద్దీన్‌.. చివరకు..

| Edited By:

Feb 21, 2020 | 12:45 AM

కర్ణాటకలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే ఒవైసీ ప్రసంగించారు. అనంతరం కొద్దిసేపటికే.. ఓ యువతి స్టేజ్‌పైన సడన్‌గా ప్రత్యక్షమైంది. వెంటనే మైక్ అందుకుని.. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. “పాకిస్థాన్ జిందాబాద్” అంటూ మైకులో రెండు మూడు సార్లు నినదించింది. వెంటనే స్టేజ్‌పైన నిర్వాహకులు తేరుకుని.. సదరు యువతిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక్క సెకను ఒక్క సెకను అంటూ.. మళ్లీ మైక్‌లో హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినదించింది. వెంటనే […]

సీఏఏ వ్యతిరేక సభలో పాకిస్థాన్ జిందాబాద్ స్లోగన్స్.. పక్కనే అసదుద్దీన్‌.. చివరకు..
Follow us on

కర్ణాటకలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే ఒవైసీ ప్రసంగించారు. అనంతరం కొద్దిసేపటికే.. ఓ యువతి స్టేజ్‌పైన సడన్‌గా ప్రత్యక్షమైంది. వెంటనే మైక్ అందుకుని.. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. “పాకిస్థాన్ జిందాబాద్” అంటూ మైకులో రెండు మూడు సార్లు నినదించింది. వెంటనే స్టేజ్‌పైన నిర్వాహకులు తేరుకుని.. సదరు యువతిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక్క సెకను ఒక్క సెకను అంటూ.. మళ్లీ మైక్‌లో హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినదించింది. వెంటనే అసదుద్దీన్ ఓవైసీ కల్పించుకుని.. అమ్మాయి చేతి నుంచి మైక్ లాగేందుకు ప్రయత్నించారు. అయితే సదరు అమ్మాయి మైక్ ఇవ్వకుండా.. మళ్లీ నినాదాలు చేయసాగింది. అయితే అక్కడే ఉన్న ఎంఐఎం కార్యకర్తలు బలవంతంగా ఆ అమ్మాయి చేతి నుంచి మైక్ లాక్కుని పోలీసులకు అప్పగించారు. వారు వెంటనే ఆమెను స్టేజ్ పై నుంచి కిందకు పంపించేశారు.

కాగా, ఈ సంఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. సదరు యువతిపై సెక్షన్ 124ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత.. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు పాకిస్థాన్‌కు అనుకూలంగా యువతి చేసిన నినాదాలను ఖండించారు. ఆ యువతి ఎవరో సంబంధం లేని వ్యక్తి అని.. ఈ కార్యక్రమ నిర్వాహకులు సైతం ఆమెను ఆహ్వానించలేదని తెలిపారు. మేమెప్పుడూ భారత్‌ కోసమే ఉంటామని.. పాకిస్థాన్‌కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమంటూ ఓవైసీ స్పష్టం చేశారు.