Delhi: మరో ఘాతుకం.. తల్లితో కలిసి తండ్రిని చంపి.. ముక్కలు ముక్కలుగా చేసి.. ఆపై

శ్రద్దా దారుణ హత్య నుంచి ఇంకా తేరుకోకముందే దేశ రాజధానిలో మరో ఘాతుకం వెలుగుచూసింది. తల్లి సహకారంతో తండ్రిని దారుణంగా చంపాడు తనయుడు.

Delhi: మరో ఘాతుకం.. తల్లితో కలిసి తండ్రిని చంపి.. ముక్కలు ముక్కలుగా చేసి.. ఆపై
Delhi Pandav Nagar Murder

Updated on: Nov 28, 2022 | 11:58 AM

దేశరాజధాని ఢిల్లీ ఘోరాతి ఘోరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. శ్రద్దా లాగే ఢిల్లీలో ఓ వ్యక్తిని ని దారుణంగా చంపేశారు. అలా చేసింది కూడా కట్టుకున్న భార్య, కన్న కొడుకే. కనీస మానవత్వం చంపిన అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు.  పాండవ్‌నగర్‌లో అంజన్‌దాస్‌ అనే వ్యక్తిని ని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేశారు. తల్లితో కలిసి తండ్రిని చంపేశాడు దీపక్‌ అనే యువకుడు. మృతుడ భార్య పూనమ్‌, కుమారుడు దీపక్‌‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు.. మృతుడు శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేసినట్లు గుర్తించారు. ఈశాన్య ఢిల్లీలోని పాండవ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

తండ్రికి నిద్రమాత్రలు ఇచ్చిన తరువాత చంపేశాడు దీపక్‌. తరువాత శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి.. ఫ్రిజ్‌లో ఫెట్టారు. ఆపై శరీర భాగాలను ఎవరికీ అనుమానం రాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశారు. తండ్రి వివాహేతర సంబంధాలను జీర్ణించుకోలేక తల్లితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు దీపక్‌. సీసీటీవీలో నిందితుల దృశ్యాలు రికార్డయ్యాయి.

 

శ్రద్దా వాకర్‌ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ఢిల్లీలో శ్రద్దా వాకర్‌ను కూడా ఇంతే దారుణంగా చంపి ముక్కలు ముక్కలు చేసి.. ఆపై పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశాడు నిందితుడు అఫ్తాబ్‌. తాజాగా ఈ కేసు విచారణంలో అఫ్తాబ్‌కు డ్రగ్స్‌ లింక్‌ బయటపడింది. గుజరాత్‌ లోని సూరత్‌లో ఫైజల్‌ మోమిన్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోమిన్‌కు అఫ్తాబ్‌కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ముంబై లోని వసాయ్‌ ప్రాంతంలో అఫ్తాబ్‌ ఇంటికి దగ్గరే మోమిన్‌ నివాసం ఉంది. ఇద్దరి మధ్య కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నట్టు కూడా గుర్తించారు. అఫ్తాబ్‌కు డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్టు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. అఫ్తాబ్‌కు డ్రగ్స్‌ అలవాటు కూడా ఉన్నట్టు శ్రద్దా గతంలో తన ఫ్రెండ్స్‌కు తెలిపింది. అఫ్తాబ్‌తో పాటు మోమిన్‌ కాల్‌ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు అష్తాబ్‌కు ఢిల్లీ పోలీసులు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..