వింటర్‌లో కరోనా వైరస్‌తో మహా డేంజర్‌!

|

Oct 12, 2020 | 1:36 PM

కరోనా వైరస్‌ దుంపతెగ! ఇంకెన్ని రోజులు ఇలా మనల్ని వేధించుకుతింటుందో కానీ రోజుకో రకంగా భయపెడుతోంది.. వేసవిలోనే ఆ మహమ్మారి జడలు విప్పుకుని బీభత్సం సృష్టిస్తే... ఇక శీతాకాలంలో ఇంకెంతగా విజృంభిస్తుందోనన్న

వింటర్‌లో కరోనా వైరస్‌తో మహా డేంజర్‌!
Follow us on

కరోనా వైరస్‌ దుంపతెగ! ఇంకెన్ని రోజులు ఇలా మనల్ని వేధించుకుతింటుందో కానీ రోజుకో రకంగా భయపెడుతోంది.. వేసవిలోనే ఆ మహమ్మారి జడలు విప్పుకుని బీభత్సం సృష్టిస్తే… ఇక శీతాకాలంలో ఇంకెంతగా విజృంభిస్తుందోనన్న అనుమానాన్ని ఆస్ట్రేలియా సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు.. ఏదిఏమైనా రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను మనం ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వేసవి సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే చల్లటి వాతావరణంలోనే వైరస్‌ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకలు అంటున్నారు.. ఇక భయపెట్టే విషయమేమిటంటే కరెన్సీ నోట్లు, మొబైల్‌ టచ్‌ స్క్రీన్‌పై వైరస్‌ 28 రోజుల వరకు నిలిచే ఉంటుందట! ఎండకాలంలోని పొడి వాతావరణంతో పోలిస్తే తేమతో నిండిన వాతావరణంలో కరోనా వైరస్‌ అయిదు రెట్లు బలంగా ఉంటుందట! అలాగని పరిశోధనాబృందానికి నేతృత్వం వహించిన జుర్జెన్‌ రిచ్ట్‌ అంటున్నారు. వింటర్‌లో కోవిడ్‌-19 నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బ్యాంక్‌ ఏటీఎమ్‌లు, సూపర్‌మార్కెట్‌ సెల్ఫ్‌ సర్వ్‌ చెక్‌ అవుట్లు .. ఇలాంటి ప్లేసుల్లో ఇంకా జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. కరోనా సోకిన వ్యక్తికి ఆమడ దూరంలో ఉండటం సురక్షితమని అంటున్నారు.. వారు తుమ్మినా, దగ్గినా, తుంపర్లు పడేటట్టు మాట్లాడినా వైరస్‌ కణాలు దగ్గరగా ఉన్నవారిని అంటుకోవడం ఖాయమని పేర్కొన్నారు. కరెన్సీ ఒక‌రి దగ్గర నుంచి మ‌రొక‌రికి మారేకొద్దీ అందరికీ వైరస్‌ అంటుకునే ప్రమాదం లేకపోలేదని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు..