ప్రియుడితో కలిసి భర్తను చంపి సెప్టిక్‌ ట్యాంక్‍లో పూడ్చిపెట్టేసిన భార్య.. దారుణ ఘటన ఎలా బయటపడిందంటే?

|

Jan 16, 2023 | 7:58 AM

గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం తన గుట్టు బయటపడకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే నిర్మాణంలో ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేసింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపి సెప్టిక్‌ ట్యాంక్‍లో పూడ్చిపెట్టేసిన భార్య.. దారుణ ఘటన ఎలా బయటపడిందంటే?
Wife Kills Husband
Follow us on

గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం తన గుట్టు బయటపడకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే నిర్మాణంలో ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేసింది. జనవరి 2న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈవిషయం తెలిసి స్థానికులందరూ ఉలిక్కపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌ శహర్‌కు చెందిన సతీష్‌కు భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. పొట్టకూటి కోసం సొంతింటిని వదిలి ఢిల్లీ సమీపంలోని నోయిడాకు వచ్చాడు. అక్కడే స్థానికంగా ఉన్న సరస్వతి కుంజ్‌లో ఒక ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇందుకోసం హర్పాల్‌ అనే తాపీ మేస్త్రీతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం తరచూ సతీష్ దగ్గరికి వస్తోన్న హర్పాల్‌ అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈనేపథ్యంలో ప్రియుడిపై మోజుతో నీజూ కూడా తన భర్తను వదిలించుకోవాలనుకుంది. దీని కోసం హర్పాల్‌తో కలిసి ఓ పన్నాగం పన్నింది.

పథకంలో భాగంగా జనవరి2న భర్త మద్యం మత్తులో ఉండగా ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది నీతూ. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే నిర్మాణ దశలో ఉన్న సెప్టింగ్‌ ట్యాంకులో శవాన్ని పూడ్చిపెట్టి ప్లాస్టరింగ్‌ చేసేశారు. అయితే గత కొన్ని రోజులుగా తన సోదరుడు కనిపించడం లేదంటూ సతీష్‌ సోదరుడు ఈ నెల 10 పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులకు సతీష్ భార్యను ప్రశ్నించారు. దర్యాప్తులో ఆమె చెప్పిన సమాధానాలు విని పోలీసులకు అనుమానం వచ్చింది. అనంతరం తమదైన శైలిలో విచారించగా షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. తాపీ మేస్త్రీతో కలిసి తన భర్తను తానే కడతేర్చినట్లు అంగీకరించింది. కాగా నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. మరోవైపు సెప్టిక్‌ ట్యాంక్‌లో పూడ్చిపెట్టిన సతీష్‌ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..