Dassault Rafale : భారత అమ్ములపొదిలో అద్భుత అస్త్రం.. డస్సాల్ట్‌ రాఫెల్‌తో దబిడిదిబిడే !

భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట ఉగ్రమూకలపై భారత సైన్యం విసిరిన పంజా.. ప్రత్యర్థి పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరి, భారత్‌ అమ్ముల పొదిలోని అసలు సిసలైన అస్త్రాల గురించి తెలిస్తే.. దాయాదికి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోవడం ఖాయం. అలాంటి ఓ ఇండియన్‌ వెపన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Dassault Rafale : భారత అమ్ములపొదిలో అద్భుత అస్త్రం.. డస్సాల్ట్‌ రాఫెల్‌తో దబిడిదిబిడే !
Dassault Rafale

Updated on: May 08, 2025 | 7:31 PM

డస్సాల్ట్ రాఫెల్. భారత సైన్యం అమ్ముల పొదిలో ఓ అద్భుత అస్త్రం ఇది. సైనిక భాషలో చెప్పాలంటే.. డస్సాల్ట్‌ రాఫెల్‌కు అర్థం వాయు వేగం, అంతకు మించి అగ్ని విస్ఫోటనం. ఇది ఫ్రెంచ్ ట్విన్-ఇంజిన్, కనార్డ్ డెల్టా వింగ్, మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. డస్సాల్ట్ ఏవియేషన్ డిజైన్‌ చేసిన యుద్ధవిమానం ఇది.

సర్వశక్తివంతమైన విమానం

విస్తృత శ్రేణి ఆయుధాలతో కూడిన డస్సాల్ట్‌ రాఫెల్ ఆధిపత్యం.. మామూలుగా ఉండదు. వైమానిక నిఘా, గ్రౌండ్ సపోర్ట్, ఇన్-డెప్త్ స్ట్రైక్, యాంటీ-షిప్ స్ట్రైక్‌లతో పాటు న్యూక్లియర్ డిటరెన్స్ మిషన్‌లను నిర్వహించడానికి ఇది అనువైన యుద్ధవిమానం. దీన్నొక సర్వశక్తివంతమైన విమానంగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

2020లో ఇండియన్ ఆర్మీలోకి ఎంట్రీ

జూలై 27, 2020న అధికారికంగా రాఫెల్‌ను తనలో చేర్చుకున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌… మొదటి ఐదు జెట్‌లను అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్‌ చేసింది. ఏప్రిల్ 2022 నాటికి మొత్తంగా 36 రాఫెల్‌ జెట్‌లు ఇండియన్‌ ఆర్మీలో భాగమయ్యాయి. సైన్యానికి అదనపు బలంగానిలుస్తున్నాయి.

గరిష్టవేగం గంటకు 1912km

15.27 మీటర్ల పొడవు, 5.34మీటర్ల ఎత్తుండే ఈ ఫైటర్‌ జెట్‌ గరిష్ట వేగం గంటకు 1912 km కాగా.. ఆ సమయంలో మాక్‌ 1.8 లెవల్‌లో ఎగరగలదు. గంటకు 1,390 km స్పీడులో Mach 1.1 ఎత్తులో దూసుకెళ్తుంది. మూడు ట్యాంకులతో సహా చొచ్చుకుపోయే సామర్థ్యం ఈ రాఫెల్‌ ఫైటర్‌ జెట్‌ సొంతం. మల్టీ రోల్‌ ఫైటర్‌గా యుద్ధంలో దూసుకుపోయే ఈ మేడిన్‌ ఫ్రాన్స్‌ యుద్ధ విమానం… ఫ్రెంచ్‌, భారత్‌, ఈజిప్టు సైన్యాల్లో భాగంగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..