తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. కారణం అదేనా..?

తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే కూటమిలపై ఓ క్లారిటీ వచ్చింది. కొత్తగా పార్టీ స్థాపించిన టీవీకే చీఫ్ విజయ్ ఒంటరిగా వెళుతున్నట్లు కన్ఫర్మ్ చేసేశారు. ఇక మరో నటుడు కమల్ హాసన్ ఎంఎన్ఎం డీఎంకే కూటమిలో ఉంది.. కానీ ఇపుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉండడం లేదని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకింత సంచలన నిర్ణయం చేసుకున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది.

తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. కారణం అదేనా..?
Kamal Haasan Mnm Not Contesting In Assembly Polls

Edited By:

Updated on: Mar 25, 2026 | 4:55 PM

దేశంలోనే ఎక్కడా లేనన్ని రాజకీయ పార్టీలు తమిళనాడులో ఉన్నాయి.. గుర్తింపు పొందిన పార్టీలు 16 వరకు ఉండగా రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య 200 కు పై మాటే.. అందుకే ఇక్కడ ఒక్కో కూటమిలో ప్రతిసారి 10 కంటే ఎక్కువ పార్టీలు ఉంటాయి.. ఈ సారి డీఎంకే ఏకంగా 18 పార్టీలతో మెగా కూటమిని ఏర్పాటు చేసింది.. డీఎంకే కూటమిలో ప్రధాన పార్టీలు డీఎంకే, కాంగ్రెస్ , వామపక్షాలు, ఎండీఎంకే, విసికే, IUML, KMDK, డీఎండీకే, నటుడు కమల్ హాసన్ కు చెందిన MNM కూడా ఇదే కూటమిలో ఉంది. అన్నాడీఎంకే కూటమిలో ప్రస్తుతానికి నాలుగు పార్టీలు మాత్రమే ఉన్నాయి.. అన్నా డీఎంకే, బీజేపీ, పీఎంకే, టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మున్నేట్ర కలగం పార్టీలు ఉన్నాయి.. కొత్తగా పార్టీని స్థాపించిన నటుడు విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తానని గట్టిగా ప్రకటించారు.

డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు.. మొత్తం 234 స్థానాలకు 28 స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించింది. వైగో లీడ్ చేస్తున్న ఎండీఎంకే పార్టీకి నాలుగు స్థానాలు కేటాయించింది. అందులో మూడు స్థానాలు డీఎంకే సింబల్‌పై పోటీ చేయాలన్న నిబంధన ఉంది. MMK కి రెండు స్థానాలు, KMDK కి రెండు స్థానాలు కేటాయించగా మిగిలిన పార్టీల కు కేటాయించే స్థానాల విషయంలో క్లారిటీ లేదు.. దీంతో మిత్రపక్షం పార్టీల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది.. దివంగత విజయ్ కాంత్ పార్టీ డీఎండీకేకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని స్టాలిన్ భావిస్తున్నారు. దీంతో కమల్ హాసన్‌కు చెందిన MNM అభ్యంతరం తెలిపింది. ముందుగా కూటమిలోకి వచ్చిన మా కంటే ఆ తర్వాత వచ్చిన డీఎండీకే కి ఎక్కువ స్థానాలు ఎలా ఇస్తారని కమల్ పార్టీ ప్రశ్నించింది. కమల్ పార్టీకి మొదట ఒక సీటు.. ఆ తర్వాత రెండు సీట్లు మాత్రమే ఇస్తామని అది కూడా డీఎంకే గుర్తుపై పోటీ చేయాలన్న డిమాండ్ పెట్టడంతో MNM నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచాయి.

ఇంతలోనే కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే ఇచ్చే ఒకటి రెండు సీట్లపై పోటీ చేయడం కంటే కూటమిలోనే ఉంటూ డీఎంకే గెలుపు కోసం పనిచేసి ప్రభుత్వం వచ్చాక సరైన ప్రాధాన్యత తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీఎంకే కమల్ హాసన్‌కు రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టింది. కమల్ ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. రజనీకాంత్‌తో కలిసి కమలహాసన్ భారీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకేకి సర్వేల్లో మంచి ఫలితాలు వస్తాయని చర్చ జరుగుతుండగా దూరం అవడం కంటే దగ్గరగా ఉంటూ పార్టీ గెలుపు కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చాక పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచనతోని ఈ నిర్ణయానికి వచ్చారా అన్న చర్చ జరుగుతుంది. కమల్ హాసన్ నిర్ణయం అలా ఉంటే పార్టీ ముఖ్యనేతలు, పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న నేతల్లో అసహనం అసంతృప్తి నెలకొంది. కమల్ హాసన్ రాజ్యసభ సభ్యులు.. ఆయన బాగానే ఉన్నారు.. డీఎంకే కూటమి తరపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా అవుతామని నమ్మకాలు పెట్టుకున్న నేతలు మాత్రం కమల్ నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us