ఈరోజు సెప్టెంబరు 14 హిందీ దినోత్సవం. దీనినే హిందీ పక్షోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వివిధచోట్ల హిందీ భాషకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీ భాషకి తగిన గౌరవం అందించేందుకు హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే భారత్‌లో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇచ్చేందకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. అయితే హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారీ కూడా చాలా సందర్భాల్లో ప్రజలు నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే ఎందుకు ఇలా హిందీ భాషపై వ్యతిరేకత వస్తుందో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. వాస్తవానికి ఇండియాలో ఎక్కువ మంది హిందీ భాష మాట్లాడుతారు. అంతేకాదు ఈ భాష విభిన్న మాండలికాలు, రూపాలను కూడా కలిగి ఉంది.
అయితే హిందీ భాషను ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తున్నారు. ఇది భారతదేశంలోని పలు ప్రాంతాలలో అధికారిక భాషగా కూడా కొనసాగుతూ వస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచే హిందీ భాషకు తగిన గౌరవం ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే హిందీ భాషపై వ్యతిరేకత రావడానికి కూడా ఓ ప్రత్యేక చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి.. హిందీ భాష దేశంలోని కొన్ని రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చేరువ కాలేకపోయింది. అప్పట్లో బ్రిటీష్ వారు సముద్ర మార్గాల గుండా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు వచ్చారు. అయితే అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను వేగవంతం చేసేశారు. దీని ఫలితంగానే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం ఎక్కవగా వాడుకలో ఉండేది.
దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల లాగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం అంత ఈజీ కాదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీ అంటే అది ఓ విదేశీ భాషగా వర్ణించేటటువంటి పరిస్థితి నెలకొంది. అందుకోసమే తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీ భాషను రుద్దుతున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇక1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్‌గోపాలాచారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. తమిళనాడులో ఉన్నటువంటి పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కూడా రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయాలా వద్దా అనే దానిపై చర్చ జరిగింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి ఉద్యమాలు చెలరేగాయి.దీంతో దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని.. 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఇంగ్లీష్‌తో సహా ఇతర భాషలను.. దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. కానీ 1965లో కూడా హిందీ భాషపై మరోసారి వ్యతిరేకత వచ్చింది. దీనివల్ల 1950లో తీసుకున్నటువంటి నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ భాషకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైన చట్టం వస్తే హిందీపై వ్యతిరేకత వస్తూనే ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.