Indian Railways: రైళ్లలో ఉమ్మివేత సమస్యకు చెక్‌ పెట్టేందుకు రైల్వే శాఖ వినూత్న యోచన.. పూర్తి వివరాలు..!

|

Oct 11, 2021 | 12:29 PM

Indian Railways: మన దేశంలో అతిపెద్ద ప్రజారవాణా సంస్థ ఏదంటే అది ఇండియన్‌ రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమతమ..

Indian Railways: రైళ్లలో ఉమ్మివేత సమస్యకు చెక్‌ పెట్టేందుకు రైల్వే శాఖ వినూత్న యోచన.. పూర్తి వివరాలు..!
Follow us on

Indian Railways: మన దేశంలో అతిపెద్ద ప్రజారవాణా సంస్థ ఏదంటే అది ఇండియన్‌ రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమతమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికి కూడా మెరుగైన రవాణా వ్యవస్థ అని చెప్పొచ్చు. అయితే కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వస్తోంది. వారి అలవాట్ల కారణంగా రైల్వే వ్యవస్థకు ప్రతియేడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అసలు విషయం ఏంటంటే చాలామంది రైలు ప్రయాణం చేసే సమయంలో రైళ్లల్లో పాన్‌లు, గుట్కాలు, పొగాకు నమిలి ఉమ్మి వేయడం వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో మరకలు పడటం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఎవరైనా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉమ్మి వేస్తూ కనిపిస్తే రూ.500 జరిమానా విధిస్తోంది. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.

ఇలా ప్రయాణికుల నిర్లక్ష్యంగా ఉమ్మి వేయడం వల్ల ఏర్పడిన మరకలు తొలగించడం కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికోసం భారీ మొత్తంలో నీటితో పాటు సుమారు 12 వేల కోట రూపాయలను రైల్వే శాఖ ఏటా ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఈ క్రమంలో పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వేలకు చెందిన 42 స్టేషన్లలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ.

ఈజీస్పీట్‌ స్టార్టప్‌ కంపెనీతో ఒప్పందం..

నాగ్‌పూర్‌కు చెందిన ఈజీస్పిట్‌ అనే స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది రైల్వే శాఖ. ఈ ఒప్పందం ప్రకారం వెస్టర్న్, నార్తర్న్, సెంట్రల్ రైల్వే వ్యవస్థలకు చెందిన మొత్తం 42 రైల్వే స్టేషన్లలో వెండింగ్ మెషీన్ల వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రూ.5 నుంచి రూ.10కు ఒక పౌచ్ అమ్మనున్నారు. ప్రయాణికులు వీటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. జేబులో పెట్టుకోవాలి. అందులోనే ఉమ్మాలి. వీటిలో కనీసం 10-15 సార్లు ఉమ్మివేయొచ్చు. అలాగే ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవు.

పౌచ్ లో ఉమ్మాక, ఆ ఉమ్మి నుంచి బ్యాక్టీరియా బయటకు రాకుండా టెక్నాలజీ వాడారు. ఉమ్మి ఘన పదార్థంగా మారుతుంది. దాన్ని బయటపడేస్తే పౌచ్ లోని గింజలు ఉమ్మిలోని పోషకాలను వినియోగించుకుని మొక్కలుగా పెరుగుతాయ్. ఈ పౌచ్‌లలో ఉండే కొన్ని గింజలు మనుషుల లాలాజలం నుంచి పోషకాలను తీసుకుని, నేలపై పడేసినప్పుడు మొక్కలుగా ఎదుగుతాయని ఈజీస్పిట్‌ సహ వ్యవస్థాపకుడు రితు మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతానికి తమ కంపెనీ ఏడాది పాటు భారతీయ రైల్వేస్‌తో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన తెలిపారు. దీని వల్ల రైళ్లలో ఉమ్మివేతల నివారణకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ కూడా చదవండి: PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!

PM Mudra Yojana: రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండిలా.. పూర్తి వివరాలు..!