Ajit Doval: అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్‌బాండ్‌.. ఉగ్రవాదుల పాలిట కాటేరమ్మ కొడుకు

అజిత్ దోవల్.. ఇండియన్ జేమ్స్‌బాండ్‌. ఉగ్రవాదుల పాలిట కాటేరమ్మ కొడుకు. పాకిస్తాన్ పై భారత దాడుల వెనుక మాస్టర్ మైండ్. దోవల్ స్కెచ్‌ వేశారంటే టెర్రరిస్టులు శవపేటికల్లోకి చేరాల్సిందే. పాక్‌-భారత్ మధ్య ఉద్రిక్తతల వేళ దోవల్‌ పేరు దేశమంతా మార్మోగుతోంది. ఆ వివరాలు..

Ajit Doval: అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్‌బాండ్‌..  ఉగ్రవాదుల పాలిట కాటేరమ్మ కొడుకు
Ajit Doval

Updated on: May 09, 2025 | 9:45 PM

భారత ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అత్యవసర భేటీ అయ్యారన్న వార్త పాకిస్తాన్ వెన్నులో వణికు పుట్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంలో అజిత్ దోవల్ కీలకంగా వ్యవహరించారు. ఆపరేషన్‌ పూర్తయ్యాక దోవల్ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చిన దౌత్యపరమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వారి అనుమానాలను నివృతి చేసి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టారు. ఉగ్రస్థావరాలపైనే దాడి చేశాం పాకిస్తాన్ సైన్యాన్ని కానీ, ప్రజలను కానీ టార్గెట్ చేయలేదన్న విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు దోవల్‌. అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్‌కు ఇతర దేశాలు మద్దతు ప్రకటించలేదు. అమెరికా, బ్రిటన్‌, సౌదీ అరేబియా, జపాన్‌, రష్యా, ఫ్రాన్స్‌ దేశాలైతే భారత్‌ చర్యలను పూర్తిగా సమర్థించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందేనని ప్రకటించాయి.

పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడంలోనూ దోవల్‌ కీలకంగా వ్యవహరించారు. ఉగ్రవాద స్థావరాలను కూల్చిన తర్వాత పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దోవల్. అన్నట్టుగానే సరిహద్దుల వెంబడి కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్‌కు మూతోడ్ జవాబిచ్చింది భారత్‌. ఇప్పటికైనా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు దోవల్‌. 2019లో పుల్వామా దాడుల అనంతరం నిర్వహించిన బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్‌ ఆపరేషన్‌లోనూ దోవల్‌ కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో అజిత్ దోవల్‌ పాత్రను భారత ప్రధాని సైతం పలుమార్లు కొనియాడారు.