AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చెత్త కుప్పలో బ్లాక్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్! విప్పి చూస్తే ఒక్కసారిగా షాక్..

పుర్రెకో బుద్ధి అన్నట్టు.. ఎవరి ఇష్టాలు వారివి. ఐతే ఓ వ్యక్తి ముద్దు ముద్దుగా పెంచుకున్న కొండచిలువ (Python) కాస్తా..

Viral News: చెత్త కుప్పలో బ్లాక్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్! విప్పి చూస్తే ఒక్కసారిగా షాక్..
Python
Srilakshmi C
|

Updated on: Mar 12, 2022 | 6:49 AM

Share

Pet python in garbage: పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు ఈ ప్రపంచంలో చాలా మందికి ఉంది. వాటికి ఏ కష్టం కలగకుండా ఉండేందుకు ఇళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవారున్నారు. వాటికి ఏ చిన్న గాయమైన అస్సలు తట్టుకోలేరు. అంత మమకారాన్ని పెంచుకుంటారు. ఇలా కుక్క, పిల్లి, ఎలుక, పులి, కుందేలు వంటి జంతువులతోపాటు చాలా మంది వారి ఇళ్లలో పాములను కూడా పెంచుకుంటారు. పుర్రెకో బుద్ధి అన్నట్టు.. ఎవరి ఇష్టాలు వారివి. ఐతే ఓ వ్యక్తి ముద్దు ముద్దుగా పెంచుకున్న కొండచిలువ (Python) కాస్తా అనారోగ్యంతో మరణించింది. సాదారణంగా పెంపెడు జంతువులను పెంచుకునే వాళ్లు అవి చనిపోయిన తర్వాత సమాధి చేయడం జరుగుతుంది. ఐతే ఈ ఉద్ధండుడు మాత్రం తన పెంపుడు కొండచిలువను చనిపోయిన తర్వాత రోడ్డు పక్కన చెత్తకుండీ (garbage)లో పడేశాడు.

ఆ మరుసటి రోజూ రోడ్లను శుభ్రం చేసే స్వీపర్‌.. డస్ట్‌బిన్‌లో చెత్తను తీస్తున్నప్పుడు, నల్లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో దాదాపు 10 అడుగుల పొడవుగల పసుపు రంగు పైథాన్ కనిపించింది. మొదట చూడగానే భయంతో పెద్దగా అరిచాడు. ఆ తర్వాత పరిశీలించిచూడగా అది మృతి చెందినట్టు గమనించి అధికారులకు సమాచారం అందిచాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు నగరం నడిబొడ్డున చెత్తకుప్పలో పడివున్న ఈ కొండచిలువ పెంపెడు జంతువయ్యి ఉంటుందని భావించారు. కొండచిలువ యజమాని వెంటనే వచ్చి దాని మృతదేహాన్ని తీసుకోవల్సిందిగా నార్త్ ఈస్ట్ లింకన్‌షైర్ కౌన్సిల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనప్పటికీ మూగ జీవాలు చనిపోయాక వాటిని రోడ్లపై విసిరేసే దురలవాటు మనలో చాలా మందికి ఉంది. వాటిపట్ల కాస్తా గౌరవభావం కలిగి సమాధికార్యక్రమాలు నిర్వహించి ఉన్నత మనుసును చాటుకుంటే ఎంతో మందికి స్ఫూర్తినింపినవారౌతారు. మీరేమంటారు..? నిజమేకదా..!

Also Read:

APGPCET 2022: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌ (ఇంగ్లీష్‌ మీడియం) 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌..