Political Friendship: చిక్కుల్లో ఉన్న దిగ్విజయ్‌ను ఆదుకున్న అమిత్ షా.. స్వయంగా వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత

|

Oct 03, 2021 | 8:42 AM

Political Friendship: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అంటారు.  అదే విధంగా ఎవరైనా కష్టంలో,  ఆపదలో ఉన్నప్పుడు అన్ని విషయాలను పక్కకు పెట్టి..

Political Friendship: చిక్కుల్లో ఉన్న దిగ్విజయ్‌ను ఆదుకున్న అమిత్ షా.. స్వయంగా వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత
Digvijaya Singh Sha
Follow us on

Political Friendship: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అంటారు.  అదే విధంగా ఎవరైనా కష్టంలో,  ఆపదలో ఉన్నప్పుడు అన్ని విషయాలను పక్కకు పెట్టి.. అవతలివారిని ఆదుకోవాలి..  అదే మానవత్వం.. అలాంటి వారిని.. అటువంటి సంఘటనలను ఎంత పెద్దవారైనా సరే మరచిపోయారు.. సమయం సందర్భం వచ్చినప్పుడు.. ఆ సంఘటనలను గుర్తు చేసుకుంటారు.. పదిమందికి చెబుతారు కూడా… తాజాగా ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లపై ప్రశంసలు కురిపించారు. నాలుగు సంవత్సరాల క్రితం ‘నర్మదా పరిక్రమ్’ కార్యక్రమం సమయంలో తాము చిక్కుల్లో ఉంటే వెంటనే తమకు సహాయం చేసిన అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్‌లకు సింగ్ కృతజ్ఞతలు తెలిపినట్లు జాతీయ వార్త పత్రికల్లో వార్తలు వెలువడుతున్నాయి.

చిక్కుల్లో దిగ్విజయ్ .. చక్కబెట్టిన అమిత్ షా.. రాజకీయపరంగా, సిద్ధాంతాల పరంగా ఇరువురు నేతల మధ్య వైరుధ్యాలు ఉన్నా ఆపద , అత్యవసర సందర్భాల్లో ఆ విభేదాలను పక్కనబెట్టి సహకరించుకుంటే .. బీజేపీ సీనియర్ నేత , కేంద్ర హోంశాఖ మంత్రి అమితాషాతో తనకు ఇలాంటి గొప్ప అనుభవమే ఎదురైందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నర్మదా కే పఠిక్ పుస్తక ఆవిష్కరణ సమయంలో పేర్కొన్నారు .

నాలుగేళ్ల క్రితం ‘ నర్మదా పరిక్రమ్ ‘ పాదయాత్రలో భాగంగా తాను , తన బృందం దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయినప్పుడు అమిత్ షా , ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమకు అన్నీ విధాలుగా సహకరించారని గుర్తుచేసు కున్నారు .  నాటి పాదయాత్రపై ‘ నర్మదా కే పథిక్ పేరుతో తన సహచరుడు ఓపీ శర్మ రాసిన పుస్తకాన్ని దిగ్విజయ్ ఆవిష్కరించారు . నాటి యాత్ర అనుభవాలను వివరిస్తూ …. యాత్రలో భాగంగా తమ బృందం దట్టమైన అడవిలో ఇరుక్కుపోగా .. ఓ అటవీ శాఖ అధికారి వచ్చి తమకు అన్ని విధాలుగా సహకరించారని చెప్పారు. తనను  అమిత్ షా పంపారని చెప్పడంతో ఆశ్చర్యపోయానని తెలిపారు . యాత్రలో భాగంగా బరూచ్ లో తనకు మాంజీ సమాజ్ ధర్మశాలలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బస ఏర్పాటు చేశారని. ఎందుకింత శ్రమ తీసుకుంటున్నారని తాను అడిగితే పైనుంచి ఆదేశాలు ఉన్నాయని వారు చెప్పారని వెల్లడించారు.  అయితే అప్పటిPolitical friendship: నుంచి ఇప్పటిదాకా తాను అమిత్ షాను తాను కలవలేదని , అయితే పలు వేదికల ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పానని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

Also Read: ప్రపంచంలో విషపూరితమైన మొక్క.. ఈ చెట్టుమీద నుంచి పడిన నీటి చుక్కకూడా ప్రాణాలను తీస్తుందట.