Rajya Sabha polls: పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, హర్యానాలలో ఇద్దరు మీడియా దిగ్గజాలు స్వతంత్ర అభ్యర్థులుగా ఉండటం జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో సరికొత్త ఊపును తీసుకువచ్చింది. హర్యానా నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సుభాష్ చంద్ర ఈసారి రాజస్థాన్ నుంచి బరిలోకి దిగారు. అదే సమయంలో కార్తికేయ శర్మ హర్యానా నుంచి అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాల నుండి క్రాస్ ఓటింగ్ ద్వారా విజయం సాధించే అవకాశాలను వీరు అంచనా వేస్తున్నారు.
క్రాస్ ఓటింగ్ అంటే ఏంటి?
క్రాస్ ఓటింగ్ లేదా క్రాస్ఓవర్ ఓటింగ్ అనేది తప్పనిసరిగా ఒక పార్టీతో సంబంధం ఉన్న ఎవరైనా తన పార్టీకి చెందని అభ్యర్థికి ఓటు వేసినప్పుడు వివరించడానికి ఉపయోగించే పదం. యుఎస్ ప్రజాస్వామ్యంలో ఓటరు తన/ఆమె పార్టీ పెట్టిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నప్పుడు ప్రైమరీలలో కూడా ఇది ఆమోదించబడుతుంది. అది అనేక సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటుంది.
కొన్నిసార్లు, క్రాస్ ఓటింగ్ అనేది వ్యూహాత్మక ఓటింగ్‌కు కూడా కారణమని చెప్పవచ్చు. అయితే, భారతదేశంలో ఇది తరచుగా రాజ్యసభ ఎన్నికల సమయంలో జరుగుతుంది. ప్రధానంగా తన పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డబ్బు ఆశ చూపడం, ఇతర ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యర్థుల ఓట్లను కైవసం చేసుకోవడానికి అధికార పార్టీలు అనేక రకాల ప్రయోగాలు, ప్రలోభాలు చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి?
లోక్‌సభలాగా రద్దు చేయలేని శాశ్వత సంస్థ రాజ్యసభ. ప్రజలచే నేరుగా ఐదేళ్లపాటు ఎన్నుకోబడే లోక్‌సభ సభ్యులలా కాకుండా, రాజ్యసభ సభ్యులను రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు ఆరేళ్లపాటు ఎన్నుకుంటారు. ప్రతి రెండు సంవత్సరాలకు, మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. తద్వారా ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. సభ్యుడు రాజీనామా చేయడం లేదా మరణించడం వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించవచ్చు. ఉప ఎన్నికలో ఎన్నికైన సభ్యుడు అతను భర్తీ చేసిన సభ్యుని మిగిలిన కాలాన్ని మాత్రమే పొందుతాడు.
భర్తీ చేయాల్సిన సీట్ల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడే ఎన్నికలు తప్పనిసరి. అన్ని రాజకీయ పార్టీలకు ఖాళీల సంఖ్య, వారి వారి బలాబలాలు తెలుసు కాబట్టి, వారు తమ అభ్యర్థులను తదనుగుణంగా నిలబెడుతుంటారు. ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్‌లో ఎటువంటి పోలింగ్ అవసరం లేదు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ రెండు ఖాళీలకు వ్యతిరేకంగా ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
బదిలీ చేయగల ఓటు అంటే ఏంటి?
ఎన్నికల సందర్భంలో ఓటర్లుగా ఎన్నికైన సభ్యులకు బ్యాలెట్ ఇవ్వబడుతుంది. అందులో వారు అవరోహణ క్రమంలో వారి ప్రాధాన్యతను సూచించాలి. బదిలీ చేయదగిన ఒకే ఓటు ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది. దీని కింద ఓటర్లు తమ ఎంపిక నంబర్ ఒకటి, రెండుని నిర్దిష్ట ఆకృతిలో జాబితా చేయాలి. అలా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తారు. అయితే, ఇద్దరు అభ్యర్థులలో ఏ ఒక్కరు కూడా ఎన్నిక కావడానికి కనీస ఓట్లను సాధించనప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
రాజ్యసభ ఎన్నికలు రహస్య ఓటింగ్ ప్రాతిపదికనా?
రాజ్యసభ ఎన్నికలు బహిరంగ, రహస్య ఓటింగ్ మిశ్రమం. ఒక పార్టీకి చెందిన ఓటరు తప్పనిసరిగా తన బ్యాలెట్‌ను అతని/ఆమె పార్టీకి చెందిన అధీకృత పోలింగ్ ఏజెంట్‌కి చూపించాలి. అయితే అతను తన పార్టీ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలని దీని అర్థం కాదు. ఓటు వేయడానికి ముందు గుర్తుపెట్టబడిన బ్యాలెట్‌ను చూపడంలో విఫలమైతే వారి ఓట్లు తిరస్కరించబడవచ్చు. అతని/ఆమె సొంత పార్టీ కాకుండా ఇతరుల పోలింగ్ ఏజెంట్‌కు బ్యాలెట్‌ను చూపడం కూడా ఓటు రద్దుకు దారితీయవచ్చు. అయితే, స్వతంత్రులు తమ గుర్తు ఉన్న బ్యాలెట్‌లను ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చేస్తే వారి ఓట్లు కూడా లెక్కించబడవు.
రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించిన బహిరంగ, రహస్య బ్యాలెట్ విధానం ఏంటి?
అవినీతిని నిరోధించడానికి, ఓట్ల కొనుగోలు సంస్కృతిని నిరోధించడానికి ఈ పద్ధతి తప్పనిసరిగా అనుసరించబడుతుంది. క్రాస్ ఓటింగ్‌కు ఎవరెవరు పాల్పడ్డారో పార్టీకి ముందే తెలిసిపోతుంది. ఆ తర్వాత సదరు శాసనసభ్యునిపై వారు తగిన చర్య తీసుకోవచ్చు. ఇది సస్పెన్షన్ లేదా బహిష్కరణ లేదా తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ నిరాకరించడంతో సహా పార్టీ తన సభ్యులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలైనా తీసుకోవచ్చు.
క్రాస్ ఓటింగ్ అనర్హతకు కారణం అవుతుందా?
క్రాస్ ఓటింగ్ అనర్హత వేటు వేయడానికి కారణం కాదు. క్రాస్ ఓటింగ్ అనేది ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాదు. ఇది సభా అంతస్తులో ఓటింగ్ జరిగినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యసభ ఎన్నికలకు వర్తించదని 2019లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఎందుకంటే ఓటరు తన స్వేచ్ఛా సంకల్పం ప్రకారం ఓటు వేయవచ్చు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఓటు వేశారో లేదో పార్టీకి తెలుసు కాబట్టి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజస్థాన్, హర్యానాలో క్రాస్ ఓటింగ్ జరగవచ్చా?
ఈ ప్రశ్నే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. క్రాస్ ఓటింగ్‌ను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ తన రాజస్థాన్ శాసనసభ్యులను ఉదయ్‌పూర్, హర్యానాకు, ఛత్తీస్‌గఢ్‌లోని న్యూ రాయ్‌పూర్‌కు తీసుకువెళ్లింది. పోటీలో ఉన్న ఇద్దరు మీడియా బ్యారన్‌ల నుండి వారిని దూరంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇది సక్సెస్ అవుతుందా? అంటే పక్కాగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లని ముగ్గురు హర్యానా కాంగ్రెస్ శాసనసభ్యులలో ఒకరైన కుల్దీప్ బిష్ణోయ్ మనస్సాక్షి ప్రకారం ఓటు వేస్తానంటూ బహిరంగంగానే ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
కాగా, ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులు గనుక క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ ఓటమి పాలవడం, ఆ మూడు ఓట్లు పడితే కార్తికేయ శర్మ రాజ్యసభకు ఎన్నికవడం ఖాయం అవుతుంది. ఇక సుభాష్ చంద్రకు తన కిట్టీలో ఉన్న ఓట్లతో పాటు అదనంగా 11 ఓట్లు అవసరం. ఇది క్రాస్ ఓటింగ్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. లేదంటే.. కాంగ్రెస్‌కు మద్ధతిస్తున్న స్వతంత్రుల మద్ధతైనా కావాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు తమ బలాబలాల ఆధారంగా ఒకటి లేదా రెండు స్థానాలు పెద్దగా కష్టపడకుండానే గెలుపొందారు.