Israel – Iran: బాంబ్స్‌ కా బాప్‌.! రాడార్లు పసిగట్టలేని B-2 బాంబర్లు.. వీటి ప్రత్యేకతలు ఏంటంటే.?

న్యూక్లియర్ కంట్రీగా ఎదగాలని కలలు కంటున్న ఇరాన్‌ని నేరుగా కంట్లో పొడిచింది అమెరికా. ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌పై భీకర దాడులు చేసి.. నేలమట్టం చేసింది. దాడి అంటే అట్టాంటిట్టాంటి దాడి కాదు.. శక్తివంతమైన బీ2 బాంబుల్ని ఏకంగా 12 సార్లు ప్రయోగించింది.

Israel - Iran: బాంబ్స్‌ కా బాప్‌.!	రాడార్లు పసిగట్టలేని B-2 బాంబర్లు..	వీటి ప్రత్యేకతలు ఏంటంటే.?
B2 Bombers

Updated on: Jun 23, 2025 | 9:48 PM

న్యూక్లియర్ కంట్రీగా ఎదగాలని కలలు కంటున్న ఇరాన్‌ని నేరుగా కంట్లో పొడిచింది అమెరికా. ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌పై భీకర దాడులు చేసి.. నేలమట్టం చేసింది. దాడి అంటే అట్టాంటిట్టాంటి దాడి కాదు.. శక్తివంతమైన బీ2 బాంబుల్ని ఏకంగా 12 సార్లు ప్రయోగించింది. అమెరికా దాడుల్ని సక్సెస్ చేసిన B-2 బాంబర్లే ఇప్పుడు వరల్డ్‌ వైడ్ టాపిక్. అసలేంటీ B2 బాంబర్లు. ప్రపంచంలో వీటిని ఎందుకు పవర్‌ఫుల్‌గా భావిస్తున్నారు..? వీటి ధాటికి శత్రువులు తోక ముడచాల్సిందేనా? అంటే అంతే అన్న సమాధానం వస్తుంది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఇరాన్‌తో యుద్ధానికి దిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఒక మాట చెప్పారు. తాము ఎన్ని క్షిపణులు ప్రయోగించినా, ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలకు ఎలాంటి ముప్పు ఉండదని, అమెరికా దగ్గరున్న బాంబర్లు దిగితే ఫలితం ఉంటుందని ముందుగానే చెప్పారు. ఆయన అన్నట్లుగా తన అమ్ముల పొదలోని కీలక అస్త్రాన్ని B-2 స్టెల్త్ బాంబర్ రంగంలోకి దింపింది అమెరికా.‌ దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బీ–2ఏ స్పిరిట్‌ స్టెల్త్‌ బాంబర్‌ గురంచే మట్లాడుతున్నాయి. B-2 స్టెల్త్ బాంబర్ అమెరికా వైమానిక దళానికి ఇదొక బ్యాక్‌ బోన్ లాంటింది. ఆదేశ ఆయుధశాలలో అత్యంత అధునాతనమైన, రహస్య ఆయుధాలలో ఇదొకటి. మూడు దశాబ్దాల కిందట స్టెల్త్ టెక్నాలజీతో రెడీ చేసింది. 1989లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దానికి మార్పులు చేసి కాసింత...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి