Assembly Elections Date 2021: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదల.. పోలింగ్ సమయం గంట పెంపు.. పూర్తి వివరాలు ఇవే..

2021 Assembly Elections Date: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​పై ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్​లో బిహార్​ ఎన్నికలను నిర్వహించిన తీరును ప్రస్తావించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోరా.

Assembly Elections Date 2021: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదల.. పోలింగ్ సమయం గంట పెంపు.. పూర్తి వివరాలు ఇవే..
ఎన్నికల షెడ్యూల్​పై ఈసీ మీడియా సమావేశం

Updated on: Feb 26, 2021 | 5:47 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​పై ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్​లో బిహార్​ ఎన్నికలను నిర్వహించిన తీరును ప్రస్తావించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోరా. కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. 824 సీట్లకు ఎన్నికలు జరగనున్నట్టు సునీల్​ అరోరా తెలిపారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. 824 సీట్లకు ఎన్నికలు జరగనున్నట్టు సునీల్​ అరోడా వెల్లడించారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

బెంగాల్‌లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు.  తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.  కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాల్ల,  అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాల్లో, పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే సిబ్బందిగా నియమించనున్నట్లు చెప్పారు. రోనా వ్యాప్తి నేపథ్యంలో.. డోర్​-టు-డోర్​ ప్రచారాలను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కాగా 16 రాష్ట్రాల్లో 36 ఉపఎన్నిక స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. పోస్టల్ బ్యాలెట్ యథాతథంగా ఉంటుందని.. పోలింగ్ సమయం గంట పెంచుతున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ నామినేషన్లకు కూడా సీఈసీ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్​ రాకతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత సులభమైనట్టు పేర్కొన్నారు సునీల్​ అరోరా. తాజా పోలింగ్​కు​ ముందే ఎన్నికల అధికారులందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.

  1. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 126 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసోంలో మార్చి 27 న తొలిదశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6 న మూడో దశ పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ మే 2న జరగనుంది.
  2. పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కౌంటింగ్ మే 2న జరగనుంది.
  3. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఎన్నికల జరగనున్నాయి.  ఫలితాలు మే2న వస్తాయి.
  4. ఏప్రిల్​ 6న తమిళనాడుకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్​ నిర్వహించనున్నారు.
  5. కేరళలో ఏప్రిల్​ 6న పోలింగ్​..140 స్థానాలున్న కేరళకు ఏప్రిల్​ 6న పోలింగ్​ జరగనుంది. మల్లాపురం ఉపఎన్నికలకు కూడా అదే రోజున పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు

  6. బెంగాల్​లో 8 విడతల్లో పోలింగ్​

  •  తొలి దశ:- 30 సీట్లకు 27 మార్చిన పోలింగ్
  • రెండో దశ:- 30 సీట్లకు ఏప్రిల్​ 1న పోలింగ్
  • మూడో దశ:- 30 సీట్లకు ఏప్రిల్​ 6న పోలింగ్​
  • నాలుగో దశ:- 44 సీట్లకు ఏప్రిల్​ 10న పోలింగ్​
  • ఐదో దశ:- సీట్లకు ఏప్రిల్​ 17న పోలింగ్​
  • ఆరో దశ:- 43 సీట్లకు ఏప్రిల్​ 22న పోలింగ్​
  • 7వ దశ:- 36 సీట్లకు ఏప్రిల్​ 26న పోలింగ్​
  • 8వ దశ:- 35 సీట్లకు ఏప్రిల్​ 29న పోలింగ్​

Also Read: Assembly Election 2021 Date LIVE: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీల ప్రకటన …

Also Read: అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే…!