West Bengal by-polls: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యింది. బెంగాల్‌లో మరోసారి అధికార తృణమూల్ సత్తా చాటింది. అసన్‌సోల్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్ధి శత్రుఘన్‌సిన్హా ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై ఆయన రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. బాలిగంజ్ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్ధి బాబుల్ సుప్రియో గెలుపొందారు. బీహార్ లోని బొచహార్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధి గెలుపొందారు. చత్తీస్‌ఘడ్ లోని ఖైరఘర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారు. మహారాష్ట్ర లోని కొల్హాపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది.
Also Read: