Petrol Bunks Bandh: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇవాళ 3వేల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.. కారణం ఏమంటే..?

|

Aug 31, 2021 | 12:00 PM

పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా దాదాపు 3000 పెట్రోల్ పంపులు మంగళవారం మూతపడ్డాయి. బెంగాల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ క్రయవిక్రయాలను నిలిపివేసి ఆందోళన..

Petrol Bunks Bandh: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇవాళ 3వేల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.. కారణం ఏమంటే..?
Petrol Bunks Bandh
Follow us on

West Bengal Petrol Bunks bandh: పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా దాదాపు 3000 పెట్రోల్ పంపులు మంగళవారం మూతపడ్డాయి. పశ్చిమ బెంగాల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ క్రయవిక్రయాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. తమ దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చింది. 24 గంటల పాటు పెట్రోల్ బంకుల సమ్మె మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.‘‘ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అత్యంత హైగ్రోస్కోపిక్. వర్షాకాలంలో ఇది పెట్రోల్ పంపుల భూగర్భ ట్యాంకుల్లోకి వర్షపు నీరు వెళుతోంది. ఇది పెట్రో డీలర్లు, వినియోగదారులకు మధ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది మాకు, కొనుగోలుదారులకు మధ్య అపనమ్మకాన్ని కలిగిస్తుంది’’ అని పెట్రోల్ పంపుల యజమానుల సంఘం జాయింట్ సెక్రటరీ ప్రసేంజిత్ సేన్ చెప్పారు.

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని, వర్షాకాలంలో ఇథనాల్-మిశ్రమ పెట్రోల్ సరఫరాను పరిమితం చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పెట్రోల్ పంపులకు ఇంధనం తక్కువగా సరఫరా చేయడం అనేది చాలా కాలంగా ఉన్న సమస్య అని దీన్ని పరిష్కరించాలని పెట్రోల్ పంపుల యజమానులు కోరుతున్నారు. ఇంధనం రవాణ సమయంలో చోరీకి గురవుతోందని, దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని పెట్రోల్ పంపుల యజమానులు అంటున్నారు. పెట్రోల్ పంపుల ఒకరోజు సమ్మెతో పలు వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.

Read Also…  రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో కాంస్యం గెలిచిన సింఘరాజ్ అధనా.. 8కి చేరిన పతకాల సంఖ్య