ఏడేళ్లుగా కదలకుండా ఒకే చోట ఉంటూ.. ఓ వింత జీవి రికార్డు సాధించింది. సైంటిస్టులకే షాక్ ఇచ్చింది. ఏవైనా జంతువులు ఒకే చోట ఉండటం అసాధ్యం. కానీ ఆ రికార్డును బ్రేక్ చేసింది ఈ జీవి. ఇది చూడటానికి బల్లిగా ఉన్నా.. యూరప్‌లోని ఓ గుహలో ఏడేళ్ల కిందట ఎక్కడ ఉందో.. ఇప్పుడు కూడా అక్కడే ఉండి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 2013వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ 7 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. కనీసం ఆహారం తినడానికి కూడా అటూ ఇటూ కదలడం లేదు. ఒకే ప్లేస్‌లో ఉంటూ.. వింత జీవుల లిస్ట్‌లోకి చేరిపోయింది.
అయితే మరీ ఆహారం కూడా తినకుండా అది ఎలా ఉండగలుగుతుంది అన్న డౌట్ మన అందరికీ వస్తుంది కదా.. అదే సైంటిస్టులకు కూడా వచ్చింది. అయితే ఆ సాలమండర్ అలా ఎన్ని రోజులు ఉంటుందో చూద్దామని.. దాన్ని టచ్ చేయకుండా అలానే వదిలేశారట. ఏడేళ్లయినా అది బతికే ఉంది. బహుశా నిద్రాణ వ్యవస్థలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. నిద్రాణ వ్యవస్థ అంటే.. సమాధి స్థితి అని అర్థం. కదలకపోయినా.. బతికే ఉందన్నట్లు.
సాధారణంగా సాలమండర్స్ అడుగు పొడవు పెరుగుతూ.. ఏకంగా 100 ఏళ్లు బతకగలవు. కానీ.. ఇవి చాలా బద్దకంగా కంగా ఉంటాయి. ఎంత అంటే కనీసం వాటి ఆహారానికి కూడా అవి పోరాడవు. అలాగే ఎక్కువగా చీకటి ప్రదేశాల్లోనే ఉంటాయి. వాటికి కళ్లు కూడా కనిపించవు.
European cave salamander stayed in the same spot for seven years 2,569 days without movinghttps://t.co/XzBSegEaUx pic.twitter.com/SAs7V3BjTK
— Andy P. (@MummyComic) February 4, 2020