Weather News: శీతల గాలుల ప్రభావంతో ఈ వారం వాయువ్య, మధ్య భారత పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు నుంచి ఈ నెల 9 వ తేదీ మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారతదేశంలో నేటి నుంచి తుఫాన్ ప్రభావం ఉండనుందని.. దీంతో నేటి నుంచి 7వ తేదీ మధ్య భారీ వర్షాలు, భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
అంతేకాదు రేపు ఎల్లుండి జమ్మూ, కాశ్మీర్ లో ఈనెల 5 వ తేదీన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ మంచు వర్షం లేదా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వివిధ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్ , పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జనవరి 5 నుంచి 9 మధ్య ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
జనవరి 5వ తేదీన పశ్చిమ మధ్యప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అంతేకాదు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో పిడుగులు పడే అవకాశం ఉంది. శీతల గాలుల ప్రభావంతో, జనవరి 8న భారీ వర్షపాతంతో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షం , మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 7-9 మధ్య, వాయువ్య , మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుంది. అదే సమయంలో జనవరి 8న రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లోనూ, జనవరి 9న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
జనవరి 5, 7 తేదీల్లో ఢిల్లీలో భారీ వర్షాలు
IMDలోని సీనియర్ సైంటిస్ట్ ఆర్‌కె జెనామణి మాట్లాడుతూ…. “జనవరి 9 వరకు వాయువ్య భారతదేశం, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 5, 6, 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శీతల గాలుల వలన పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చు , ఆకాశం మేఘావృతమై ఉండవచ్చునని చెప్పారు. జనవరి 5, 7 తేదీల్లో ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శీతల గాలుల ప్రభావంతో తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో వర్షాలు, వడగళ్ల వాన కురుస్తాయని తెలిపారు.
Also Read: