అక్రమ ఆయుధాలను సప్లై చేస్తున్న ముఠా అరెస్ట్

| Edited By:

Jun 12, 2020 | 7:55 PM

అక్రమంగా ఆయుధాలను సప్లై చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు మధ్య ప్రదేశ్ పోలీసులు. ఇండోర్ వేదికగా నడుస్తున్న ఈ ఆయుధాలను సప్లై చేస్తున్న నలుగుర్ని ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్రమ ఆయుధాలను సప్లై చేస్తున్న ముఠా అరెస్ట్
Follow us on

అక్రమంగా ఆయుధాలను సప్లై చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు మధ్య ప్రదేశ్ పోలీసులు. ఇండోర్ వేదికగా నడుస్తున్న ఈ ఆయుధాలను సప్లై చేస్తున్న నలుగుర్ని ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్‌జీత్ సింగ్, మంగల్ సింగ్, వికాస్ బరోల్, మరియు దినేష్ సింగ్ అనే నలుగురు వ్యక్తులు ఆయుధాలను అక్రమంగా విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో.. ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు నిందితుల ఉండే స్థలాలపై రైడ్ చేశారు. ఈ క్రమంలో నిందితుల వద్ద 27 దేశీ పిస్టల్స్‌, 10 దేశీ రివాల్వర్లు,10లైవ్ కాట్రేడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం అక్రమ ఆయుధాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. అతడి వద్ద 35 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ను ట్రేస్ చేస్తున్నామని.. ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర ముఠాను కూడా పట్టుకుంటామని ఇండోర్ క్రైం బ్రాంచ్ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.