దిగివచ్చిన వైనం, ఈ నెలాఖరులోగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్, ఎయిరిండియా యాజమాన్యం హామీ

| Edited By: Anil kumar poka

May 05, 2021 | 1:14 PM

ఈ నెలాఖరులోగా తమ సంస్థ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ కారక్రమాన్ని చేపడతామని ఎయిరిండియా యాజమాన్యం ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తమకందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని...

దిగివచ్చిన వైనం, ఈ నెలాఖరులోగా  ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్, ఎయిరిండియా యాజమాన్యం హామీ
We Will Vaccinate All Employees By Minth Says Airindia Management
Follow us on

ఈ నెలాఖరులోగా తమ సంస్థ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ కారక్రమాన్ని చేపడతామని ఎయిరిండియా యాజమాన్యం ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తమకందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సంస్థ పైలట్లు హెచ్చరించిన విషయం గమనార్హం. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఈ మేరకు నిన్న పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురికి లేఖ రాసింది. మీరు వ్యాక్సినేషన్ చేపట్టకపోతే పనులను నిలిపివేస్తామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా తమ సిబ్బందికి వ్యాక్సిన్ క్యాంపులను నిర్వహించాలని ఈ సంఘం సూచించింది. వ్యాక్సినేషన్ విషయమై ఇదివరకే చర్చలు జరిగాయని, ఈ మాసాంతానికి ఈ కార్యక్రమం చేపడుతామని ఎయిరిండియా యాజమాన్యం  ఓ ప్రకటనలో తెలిపింది. 45 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ కి అనుమతి లేదని గైడ్ లైన్స్ పేర్కొంటున్నాయని అందువల్లే దీన్ని పూర్తి చేయలేకపోయామని యాజమాన్యం వివరించింది. అటు సిబ్బందిలో చాలామంది కరోనా వైరస్ పాజిటివ్ తో బాధ పడుతున్నారని, ఆక్సిజన్ సిలిండర్ల కోసం, హాస్పిటల్ ఖర్చులకోసం వారు నానా యాతన పడుతున్నారని  పైలట్ల సంఘం తమ లేఖలో పేర్కొంది.

తమకు హెల్త్ కేర్ సపోర్టు గానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం గానీ లేదని వారు తెలిపారు. వ్యాక్సినేషన్ లేకుండా మా  ప్రాణాలకు  రిస్క్ తెచ్చుకోలేం..పాన్ ఇండియా ప్రాతిపదికపై 18 ఏళ్ళు పైబడిన వారికందరికి వ్యాక్సినేషన్ చేపట్టాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. తమ వేతనాల్లో భారీ కోత కూడా విధించారని, కరోనా వైరస్ మొదటి సీజన్ కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని వారు కోరారు. ప్రస్తుతం తమ వేతనాల్లో 50 శాతం  కోత ఉందన్నారు. ఈ సెకండ్ కోవిడ్ సీజన్ లో ఇలా కోత విధించడం వల్ల చాల నష్టపోతున్నామని, వేతనాల డిడక్షన్ లో 5 శాతాన్ని పునరుద్ధరించినా  ఫలితం లేదని వారు పేర్కొన్నారు. కనీసం పౌర విమానయాన శాఖ  కార్యాలయమైనా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అయితే ఎయిరిండియా యాజమాన్యం మాత్రం వీరి  ఈ డిమాండుపై స్పందించలేదు.  ఈ కోవిద్ సమయంలో అనేక దేశాలు భారతీయుల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయాన్ని కూడా పైలట్లు ప్రస్తావించారు.