బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయం, శివసేన నేత సంజయ్ రౌత్, ఈ నెల 25 న కోల్ కతా కు భారీగా బలగాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతునివ్వాలని...

బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయం, శివసేన నేత సంజయ్ రౌత్, ఈ నెల 25 న కోల్ కతా కు భారీగా బలగాలు

Edited By:

Updated on: Mar 04, 2021 | 2:34 PM

West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతునివ్వాలని తమ ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే నిర్ణయించారని ఆయన వెల్లడించారు. దీదీ నాయకత్వంపట్ల తమ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మమత విజయం సాధిస్తారని వ్యాఖ్యానించిన ఆయన.. ఆమెను రియల్ బెంగాల్ టైగర్ అని అభివర్ణించారు. డబ్బు,ఎమ్మెల్యేలకు  ప్రలోభాలతో బీజేపీ ఆమెను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని, కానీ అవి విఫలమవుతాయని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ పట్ల ఉద్దవ్ ప్రభుత్వం మండిపడుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, మహారాష్ట్రలో శివసేన సర్కార్ కి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.  బెంగాల్ లో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు దీదీ ప్రభుత్వం చేసే యత్నాలకు తాము మద్దతునిస్తామని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇలా ఉండగా ఈ నెల 25 నాటికీ బెంగాల్ కు 650 కంపెనీల పారా మిలిటరీ బలగాలు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 కంపెనీల బలగాలు కోల్ కతా చేరుకున్నాయి. మరో 169 ఈ వారాంతంలో అక్కడికి వెళ్లనున్నాయి.  2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సరి ఇంత భారీ ఎత్తున భద్రతా దళాలను ఈ రాష్ట్రంలో మోహరించడం ఇదే మొదటిసారి. బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో జరగనున్నందున అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అత్యధిక బలగాలను వవినియోగించాల్సి ఉంటుంది. అసలే పాలక తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి, టీఎంసీ కార్యకర్తలపై  బీజేపీ వర్గీయులు, బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ శ్రేణులు దౌర్జన్యాలకు, దాడులకు  పాల్పడడం సర్వ సాధారణమవుతోంది. ఎన్నికల వేళ వీరి  మధ్య హింస మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ కారణం వల్లే మరే రాష్ట్రానికి పంపనంతగా ఇన్ని బలగాలను పంపుతున్నారు.


మరిన్ని చదవండి ఇక్కడ :

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video

snake Drinking water Viral Video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించిన వ్వక్తి వైరల్ అవుతున్న వీడియో..!

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!