ఉత్తరాఖండ్ ల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇంతే కాదు… పాత కరెంట్ బిల్లులను మాఫీ చేస్తామని, ఢిల్లీలో మాదిరి కాకుండా ఇక్కడ పవర్ కట్స్ లేకుండా చూస్తామని రైతులకు ఉచితంగా పవర్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక్కడ అధికార పార్టీకి సీఎం అంటూ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. తమ ముఖ్యమంత్రి బ్యాడ్ అని బీజేపీ కార్యకర్తలే చెప్పుకుంటూ ఉంటారన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడూ ఈ పార్టీలో ఫైట్ జరుగుతూ ఉంటుందన్నారు. ఇక ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎవరు చూస్తారని ప్రశ్నించారు.మా ఢిల్లీలో మేం ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్హును ఉచితంగా ఇస్తున్నాం.. మాకు విద్యుత్ ప్లాంట్లు లేకున్నా ఈ వెసులుబాటును కల్పిస్తున్నాం.. అని ఆయన చెప్పారు.మా నగరంలో మహిళలు సంతోషంగా ఉన్నారు అని పేర్కొన్నారు.
ఇక పంజాబ్ విషయానికి వస్తే అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మహిళలు ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఆ రాష్ట్రంలో కూడా ఆప్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల పవర్ ను ఉచితంగా ఇస్తామని ఆయన ఇదివరకే ప్రకటించారు. పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తహతహలాడుతోంది. ఉత్తరాఖండ్ లో 20 నుంచి 22 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలనీ ఆప్ యోచిస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రాన్ని తాను రేపు మళ్ళీ విజిట్ చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Cell Tower: కృష్ణా జిల్లాలో విచ్చలవిడిగా సెల్ టవర్లు.. మొత్తం ఎన్ని టవర్లున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!
హర్యానాలో ఆగని రైతుల నిరసనలు.. పోలీసులతో ఘర్షణలు.. బీజేపీ నేతల కార్యక్రమాలకు అడ్డంకులు