పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తాం…. అక్కడ అధికారం మాదే.. బీజేపీ నేత బీ.ఎల్. సంతోష్

పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తామని బీజేపీ నేత బీ.ఎల్. సంతోష్ తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. చండీ గడ్ లో తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన..

పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తాం.... అక్కడ అధికారం మాదే.. బీజేపీ నేత బీ.ఎల్. సంతోష్
Bjp Leader B L Santosh

Edited By: Phani CH

Updated on: Jul 10, 2021 | 11:01 AM

పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తామని బీజేపీ నేత బీ.ఎల్. సంతోష్ తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. చండీ గడ్ లో తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. ఆ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. వారి ఆశలకు అనుగుణంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు మీరు కూడా కేంద్ర పథకాలను పంజాబ్ ప్రజల దృష్టికి తేవాలని ఆయన సూచించారు.వివాదాస్పద రైతు చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం విఫలమవుతుందని..ఇవి తమ మేలుకేనన్న విషయాన్ని రైతులు గుర్తిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల అన్నదాతలు ఇప్పటికీ ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్నారని.. కానీ వారిలో చాలామంది ఈ ఆందోళనపై పునరాలోచన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కేంద్రంతో వారు చర్చలకు రావాలని తాము కోరుతున్నామన్నారు. వారితో చర్చలకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉన్నారు.. వ్యవసాయ రంగ ప్రయోజనాలు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి కూడా చాలా ముఖ్యం అని ఆయన చెప్పారు. కేంద్ర పాలసీలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

ఇలా ఉండగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజుల క్రితమే ఈ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినప్పటికీ.. రాజీ ఫార్ములాపై నాయకత్వం ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు పట్టు బడుతున్నారు. ఇటీవలే ఆయన రాహుల్ గాంధీతోను, ప్రియాంక గాంధీతో కూడా సమావేశమయ్యారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Puri Rathyatra: రెండో ఏట భక్తులు లేకుండా పూరీ జగన్నాథ రథయాత్ర.. రెండు డోసుల టీకా తీసుకున్న సేవకులకే అనుమతి

Sirisha Bandla: నా కల నిజమవుతుందని తెలుసు.. అమెరికాలో వ్యోమగామి కానున్న ఆంధ్రా అమ్మాయి శిరీష బండ్ల..