మహారాష్ట్రలో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేకి హీరేన్ హత్యలోనూ ప్రమేయం !

మహారాష్ట్రలో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజే విషయంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్  అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి...

మహారాష్ట్రలో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేకి హీరేన్ హత్యలోనూ ప్రమేయం !
Sachin Vaze

Edited By:

Updated on: Mar 23, 2021 | 5:25 PM

మహారాష్ట్రలో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజే విషయంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్  అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. (ముకేశ్ అంబానీ ఇంటి వద్ద గిలెటిన్లు ఉంచిన వాహన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు  ఈయనను  అరెస్టు చేసి విచారిస్తున్నారు. ) ఈ కేసు విషయంలో  ఇదే సమయంలో ఈ స్క్వాడ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచిన   వాహన యజమాని మాన్ సుఖ్ హీరేన్ హత్యకు సచిన్ వాజే కుట్ర పన్నాడని స్క్వాడ్ అధికారులు  మంగళవారం తెలిపారు.   హీరేన్ మృతదేహాన్ని ఈ నెల 5 న థానే లోని ఓ కాలువ వద్ద కనుగొన్న సంగతి తెలిసిందే. ఈ మర్డర్ కేసులో వాజే ప్రమేయం ఉందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈ అధికారులు తెలిపారు. తన భర్త మరణానికి వాజే కారకుడని హీరేన్ భార్య విమల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయన వేధింపుల కారణంగా తన భర్త నిత్యం మనస్తాపం చెందేవాడని కూడా ఆమె చెప్పింది. కాగా- ఈ హత్య కేసుకు సంబంధించి డామన్ నుంచి ఓ వోల్వో కారును తాము స్వాధీనం చేసుకున్నామని, అది వాజేకు చెందినదని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్  తెలిపారు. ఇతని వద్ద మరో మూడు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయన్నారు. హిరేన్ ను హతమార్చవలసిందిగా వాజే తన సహచరులకు సూచించినట్టు భావిస్తున్నామన్నారు. తన ఎస్ వీ యూ వాహనాన్ని ఎవరో దొంగిలించారని నాడు హీరేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఆ వాహనాన్ని ఇతడే చోరీ చేశాడని తెలుస్తోందని ఆయన చెప్పారు.

హీరేన్ కారు చోరీ కావడానికి ఒక రోజు ముందు ముంబైలోని ఓ పోష్ హోటల్ ని చెక్ చేసేందుకు సచిన్ వాజే ఫేక్ ఆధార్ కార్డును ఉపయోగించాడని కూడా వెల్లడైంది. ఈ కార్డులో ఈయన తన  పేరును సుశాంత్ సదాశివ్ ఖంకార్ అని పేర్కొన్నాడట.

మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సమంత‌ ఓల్డ్‌ వీడియో.. చూసి ఫ్యాన్స్‌ షాక్‌..!: Samantha old viral video.

నీకు కడుపు పండాలీ అంటే చిన్నారిని బలివ్వాలీ అని చెప్పగానే నమ్మింది..!చివరికి ఇలా..:Women believes a child is sacrified Video.