బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో పాలక తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన నేతలకు, అలాగే పార్టీలో మచ్చ పడినవారికి టికెట్లు ఇస్తున్నారంటూ కోల్ కతా లో నిన్న వందలాది కార్యకర్తలు పార్టీ ఎన్నికల కార్యాలయం వద్ద వీరంగం సృష్టించారు. వాగ్వివాదాలు, ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా ఛేదించుకుని కార్యాలయం లోకి చొరబడేందుకు వారు ప్రయత్నించారు. పార్టీ సీనియర్ నేతలైన అర్జున్ రెడ్డి, ముకుల్ రాయ్, శివప్రకాష్ వంటి వారిని వీరు ఘెరావ్ చేయడానికి యత్నించారు. బీజేపీ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో మాజీ టీసీఎంలకు టికెట్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించిన వీరు… , పార్టీకోసం ఇంతకాలం కష్టపడిన తమవంటివారిని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. హోమ్ మంత్రి అమిత్ షా అస్సాంలో తన పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్ళబోతూ మధ్యలో కోల్ కతా లో ఆగినప్పుడు వీరంతా చెలరేగిపోయారు. అటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నిన్నటి రోజంతా ఈ నగరంలోనే ఉన్నారు. హౌరా, సింగూరు వంటి జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను పార్టీ కార్యకర్తలు ద్వంసం చేశారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖాకీలు ఇనుప బ్యారికేడ్లను పెట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. హుగ్లీ, చింసూరా జిల్లాల్లో కూడా వీరు పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. సింగూర్ లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ భట్టాచార్య కు టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు ఆగ్రహం చెందారు. సంస్థాగత సమావేశాలకు వచ్చిన మధ్యప్రదేశ్ విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి ఓ షాపులో సుమారు నాలుగు గంటలపాటు ఉండిపోవలసి వచ్చింది. ఆయన ఉండగానే ఈ షాపునకు కార్యకర్తలు తాళం వేసేశారు.. ఆ తరువాత పోలీసులు వచ్చి ఆయనను అతి కష్టం మీద సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు.
చింసూరాలో సిటింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీకి టికెట్ ఇవ్వడంతో పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి అంతులేకపోయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video