
Shocking Video: మృత్యువు ఎప్పుడూ చెప్పిరాదు.. ఏ క్షణంలో ఎటువైపు నుంచి.. ఏ విధంగా వస్తుందో చెప్పలేం. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ సేఫ్‌గా ఇంటికి చేరుతాడని స్పష్టం చేప్పలేం. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ గుండె జల్లుమనేలా ఉంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదివారం మహారాష్ట్రలోని థానే జిల్లాలో గుంతల కారణంగా బైక్‌పై వెళ్తున్న గణేష్ ఫాలే(22) బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. అయితే, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు.. ఆ వ్యక్తి పైనుంచి దూసుకుపోయింది. అయితే, ట్రక్కు దూసుకురావడాన్ని గమనించిన బాధిత వ్యక్తి చేయి ఎత్తి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, లారీ హైట్ కారణంగా అతను కనిపించకపోవడంతో గణేష్ ఫాలేపై దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతన్ని గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. దివా అగాసన్ రోడ్డులో జరిగిన ఈ ఘటన దృశ్యాలు అక్కడి సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
కాగా, ఈ ప్రమాదంపై విపక్ష నాయకులు స్పందించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. యాక్సిడెంట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఎమ్మెల్యే రాజు పాటిల్.. గుంతల కారణంగానే వ్యక్తి మరణించాడని అన్నారు. ఆ పోస్ట్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ట్యాగ్ చేశారు. రోడ్ వర్క్‌లు కేవలం కాగితాలపై మాత్రమే ప్రకటించడం జరిగిందని, వాస్తవానికి సరైన రోడ్లే లేవని విమర్శించారు.
दिवा ठाण्यात, आणि ठाण्याचेच मुख्यमंत्री…..दिव्यात आज पुन्हा एकदा खड्ड्यामुळे बळी गेला. कामांच्या फक्त कागदावर घोषणा होत आहेत पण कामं होत नाहीत. @TMCaTweetAway अजून किती बळी घेणार ? @mieknathshinde @CMOMaharashtra pic.twitter.com/vKo3K8bBWa
— Raju Patil ( प्रमोद (राजू) रतन पाटील ) (@rajupatilmanase) August 28, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..