Manali : జిప్‌లైన్ సవారీ చేస్తుండగా కేబుల్ తెగి కిందపడిన త్రిషా.. తీవ్రగాయాలు

మనాలి జిప్‌లైన్ ప్రమాదంలో నాగ్‌పూర్ బాలిక తీవ్రంగా గాయపడింది, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిప్‌లైన్‌లో జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రమాదం తర్వాత తక్షణ సహాయం అందించలేదని బిజ్వే కుటుంబం ఆరోపించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Manali : జిప్‌లైన్ సవారీ చేస్తుండగా కేబుల్ తెగి కిందపడిన త్రిషా..  తీవ్రగాయాలు
Zipline Rope Ride

Updated on: Jun 15, 2025 | 4:01 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి వేసవి సెలవుల కోసం వెళ్ళిన నగ్పూర్‌కు చెందిన బిజ్వే కుటుంబం ఓ భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంది. జూన్ 8న వారి 10ఏళ్ల కుమార్తె త్రిషా బిజ్వే జిప్‌లైన్ సవారీ చేస్తుండగా.. జిప్‌లైన్ కేబుల్ అకస్మాత్తుగా తెగిపోవడంతో సుమారు 30 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో త్రిషా కాలి ఎముకలు విరిగిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం తర్వాత వెంటనే సహాయం అందించలేదని చెబుతున్నారు. త్రిషాకు తొలుత మనాలీలో ప్రాథమిక వైద్యం అందించి.. అనంతరం ఆమెను చండీగఢ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నగ్పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రమాద సమయంలో షూట్ చేసిన వీడియోను బిజ్వే కుటుంబం విడుదల చేశారు. ఆ వీడియోలో త్రిషా కూర్చున్న హార్నెస్ ఒక్కసారిగా ఊడిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనకు జిప్‌లైన్ నిర్వాహకులను బాధ్యత వహించాలని..సాహసక్రీడా కేంద్రాలలో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాద వీడియో దిగువన చూడండి