Viral Video: ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన నిఖిల్.. సో శాడ్

|

Jul 14, 2022 | 2:49 PM

బాక్సింగ్ ప్రమాదకరమైన క్రీడ అన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యర్థి విసిరిన పంచ్.. 23 ఏళ్ల నిఖిల్​ పాలిట యమపాశమైంది. బెంగళూరు నగరభావి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

Viral Video: ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన నిఖిల్.. సో శాడ్
Boxer Dies
Follow us on

Bengaluru: బెంగళూరు నగరభావి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి K1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి విసిరిన భారీ పంచ్‌కు ఓ యువ బాక్సర్ మృతి చెందాడు. ఈ ఘటనలో నిర్వాహకులు నిర్లక్ష్యం ఉండటంతో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మృతుడు మైసూరు(Mysuru)లో నివాసముంటున్న విమల- సురేష్ దంపతుల చిన్న కుమారుడు 23 ఏళ్ల నిఖిల్. జూలై 10న జ్ఞాన జ్యోతి నగర్‌లోని పాయ్ ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో జరిగిన కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యర్థి విసిరిన పంచ్‌తో నిఖిల్ తలకు తీవ్ర గాయమైంది. అతడు స్పాట్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది.

మ్యాచ్ సందర్భంగా తీసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రత్యర్థి ముఖంపై బలంగా పంచ్ ఇవ్వడంతో నిఖిల్ రింగ్‌లో కుప్పకూలిపోవడం మనం చూడవచ్చు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బెంగళూరులోని నాగరభావిలోని జీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన అతడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.  జులై 10న సాయంత్రం 6 గంటల సమయంలో మ్యాచ్ ఆడుతుండగా నిఖిల్‌కు గాయాలయ్యాయని ఓ వ్యక్తి నుంచి తన మొబైల్ ఫోన్‌కు కాల్ వచ్చిందని అతని తల్లి విమల తెలిపారు. నేలపై ఉన్న చాప చాలా పల్చగా ఉందని, నిఖిల్ దెబ్బ తగిలి నేలపై పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని అతని తండ్రి సురేష్ ఆరోపించారు. నిఖిల్‌కు గాయమైనప్పుడు నిర్వాహకులు ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించలేదని, పారామెడికల్ యూనిట్, ఆక్సిజన్ సౌకర్యం, స్ట్రెచర్ కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. నిఖిల్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జ్ఞాన భారతి పోలీసులు తెలిపారు.


జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..