Har Ghar Tiranga: ఆసేతు హిమాచలం త్రివర్ణ పతాకమయం.. ఇంటిమీద జాతీయ జెండాను ఆవిష్కరించిన హోం మంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు

|

Aug 13, 2022 | 12:57 PM

స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా ఉత్సవాల్లో భాగంగా ఆసేతు హిమాచలం త్రివర్ణ పతకాలు శోభను సంతరించుకున్నాయి. సినీ నటులు, కేంద్ర మంత్రుల నుంచి సామాన్యుల వరకూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Har Ghar Tiranga: ఆసేతు హిమాచలం త్రివర్ణ పతాకమయం.. ఇంటిమీద జాతీయ జెండాను ఆవిష్కరించిన హోం మంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు
Union Home Minister Amit Sh
Follow us on

Har Ghar Tiranga: భారతదేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని.. ‘ హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఉదయం తన భార్యతో కలిసి తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నేటి (ఆగష్టు 13) నుండి ఆగస్టు 15 వరకు సాగే ఈ డ్రైవ్ లో.. తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయమని ప్రజలను ప్రధాని మోడీ కోరారు.

అమిత్ షా తన భార్యతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ప్రధాని పిలుపుని అందుకుని.. పలువురు ప్రముఖులు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా..  2002ను సవరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా జూలై 20న ఉత్తర్వుల జారీ చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాదు జాతీయ జెండా ఎగురవేయడానికి సవరించిన వివరాలను పేర్కొంటూ.. కేంద్ర మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలకు తెలియజేశారు.

దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని పొందడానికి పౌరులు తమ ఇళ్ల వద్ద జెండాలను ఎగురవేయాలని, సోషల్ మీడియా డీపీలను మార్చుకోవాలని గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 

 

ఆసేతు హిమాచలం త్రివర్ణ పతకాలు శోభను సంతరించుకున్నాయి. సినీ నటులు, కేంద్ర మంత్రుల నుంచి సామాన్యుల వరకూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..