జమ్మూ కాశ్మీర్ లోని మారుమూల గ్రామాలలోనివారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు హెల్త్ కేర్ వర్కర్ల బృందం సాహసమే చేసింది. టీకామందులను స్టోర్ చేసేందుకు వినియోగించే కోల్డ్ బాక్సులతో అతి కష్టం మీద నదిని దాటింది. మోకాలి లోతు నీటి నుంచి ఒకరి చేతులను మరొకరు పట్టుకుని సాయం చేసుకుంటూ వారు నదిని దాటుతున్న దృశ్యం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుర్భేద్యమైన, ఎవరూ దాదాపు చేరలేని సుదూర గ్రామాలు రాజౌరి, షోపియన్ వంటి జిల్లాల్లో ఉన్నాయి. నిన్న ఈ వైద్య బృందం రాజౌరి జిల్లా గ్రామాలకు వెళ్ళడానికి ఇలా నదిని దాటాల్సి వచ్చింది. ఇందుకు కారణం ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడమే.. ఉన్నా దారంతా గతుకులమయం కావడంతో ప్రయాణించలేని పరిస్థితి ఉంది. అందువల్లే వీరు ఈ సాహసానికి పూనుకొన్నారు. ఇలాంటి విలేజీలలో గ్రామీణులకు వంద శాతం వ్యాక్సినేషన్ చేయాలన్నది తమ లక్ష్యమని రాజౌరి జిల్లా వైద్య అధికారి ఇక్బాల్ మాలిక్ తెలిపారు. 45 ఏళ్ళు పైబడిన వయస్సువారికంతా టీకామందులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా నదిని దాటిన హెల్త్ కేర్ వర్కర్లను అనేకమంది ప్రశంసించారు. వృత్తి పట్ల, విధినిర్వహణ పట్ల వీరి అంకిత భావానికి జోహార్లు అని నెటిజన్లు ట్వీట్ చేశారు.
నిజానికి 71.93 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ విషయంలో ఈ కేంద్ర పాలిత ప్రాంతం చాలా విజయం సాధించింది. జమ్మూ, షోపియన్, గందెర్ బల్ తదితర జిల్లాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో నిన్న 1723 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 34 మంది రోగులు మరణించారు. 29,615 యాక్టివ్ కేసులు రిజిస్టర్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
#WATCH Health workers cross a river to reach a remote area of Kandi block in Rajouri to conduct COVID19 vaccination drive#JammuAndKashmir pic.twitter.com/9x2CH6ogb6
— ANI (@ANI) June 4, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Covid Third Wave: కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట.. కొవిడ్ థర్డ్ వేవ్ ఆ నెలలో వచ్చే అవకాశం? ఎప్పుడంటే?