National news: అమెరికా వెళ్లాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ఎందుకంటే..

|

Nov 01, 2021 | 7:00 AM

కొవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో పలు దేశాలు అంతర్జాతీయ ప్రయణాలపై ఆంక్షల్ని సడలిస్తున్నాయి..

National news:  అమెరికా వెళ్లాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ఎందుకంటే..
Follow us on

కొవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో పలు దేశాలు అంతర్జాతీయ ప్రయణాలపై ఆంక్షల్ని సడలిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో విదేశీ ప్రయాణికులపై నిషేధం ఎత్తి వేశారు. దీంతో చాలామంది యూఎస్‌కు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం మరి కొన్ని రోజులు వేచిచూడక తప్పదని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా వలసేతర వీసా కేటగిరీల (నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ) వారికి ఈ నిరీక్షణ తప్పదని అమెరికన్‌ ఎంబసీ అధికారులు పేర్కొంటున్నారు.

భద్రతే మాకు ముఖ్యం..
నవంబర్‌ 8 నుంచి యూఎస్‌ ప్రయాణానికి అనుమతిలివ్వడంతో లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వీరి సంఖ్య భారీగానే ఉంది. అయితే ఆంక్షల నుంచి ఉపశమనం లభించినా వీసాల పునరుద్ధరణ, కొత్త వీసాల జారీకి మరికొంత కాలం పట్టే సమయం ఉందని అమెరికా రాయబార కార్యాలయం చెబుతోంది. ‘ కొవిడ్‌ వల్ల నిలిచిపోయిన అంతర్జాతీయ కార్యాకలాపాలను ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నాం. అయితే ఎంబసీ, కాన్సులేట్‌ కార్యాలయాల్లో పనులు ఆలస్యమయ్యేటట్లు ఉన్నాయి. ముఖ్యంగా వీసా అపాయింట్‌మెంట్ కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. మేం రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. వీలైనంత త్వరగా వీసాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తాం ‘ అని ఎంబసీ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

Also read:

Crime News: మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.. 13 ఏళ్ల విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసిన ప్రత్యేక కోర్టు..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తాజాగా వెండి ధర ఎంత ఉందంటే..!

Bank Holidays November 2021: బ్యాంకు కస్టమర్లు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..