Pakistani spies: మన నిఘాకు దొరికిన 11 మంది పాకిస్తాన్ స్లీపర్‌సెల్స్‌.. ఇవిగో పూర్తి వివరాలు

ఒకడు యూట్యూబ్‌లో వాగడమే వృత్తిగా కనిపిస్తాడు.. ఇంకొకడు బుద్దిగా చదువుకుంటున్నట్టు నటించే విద్యార్థి, మరొకడు వ్యాపారం ముసుగు తొడుక్కుంటాడు.. ఇంకోడు సెక్యూరిటీ గార్డ్‌ వేషమేసుకుంటాడు.. కానీ వీళ్లే సైడ్ ప్రొఫెషన్ మాత్రం పాకిస్తాన్‌కు చాటుమాటు చాకిరీ చేయడం. ఒక్కరు కాదు.. 11 మంది.. ఎవరికి వారే దేశముదుర్లు. పాకిస్తాన్‌ కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు. మన ఉప్పు తింటూ మన పైకప్పుకు కన్నమేసే బాపతు.

Pakistani spies: మన నిఘాకు దొరికిన 11 మంది పాకిస్తాన్ స్లీపర్‌సెల్స్‌.. ఇవిగో పూర్తి వివరాలు
Pakistani Spies

Updated on: May 19, 2025 | 9:43 PM

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత పాకిస్తాన్‌ గూఢచారుల కోసం నలుమూలలా వేట కొనసాగుతోంది. తరచూ పాకిస్తాన్‌కు వెళ్లొస్తున్నవారిపై ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టింది. ఆలోవర్ ఇండియా 11 మంది పాక్‌ ఏజెంట్లు అరెస్ట్‌ అయ్యారు. దేశ రహస్యాల్ని పాకిస్తాన్‌ ISIకి చేరవేస్తున్న దేశద్రోహులుగా వీళ్లను గుర్తించారు. వీళ్లు చేసిన గూఢచర్యంపై లోతుగా ఆరాతీస్తున్నారు పోలీసులు. ఈ గుంపులోకెల్లా మహా ముదురు ఎవరంటే.. యూట్యూబ్‌లో తన గ్లామర్‌నే పెట్టుబడిగా పెట్టి పాకిస్తాన్‌తో ప్రేమాయణమే కాదు కామాయణం కూడా కొనసాగించిన జ్యోతి మల్హోత్రా. Jyoti Malhotra వీడియోల మాటున గూఢచర్యం చేస్తూ.. దేశ రహస్యాలు అమ్ముతూ, పాక్ ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకుంటూ.. టోటల్‌గా ఒక్క క్లిక్‌తో దేశ భద్రతను పణంగా పెట్టింది జ్యోతి మల్హోత్రా. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్..ఇండియన్ గర్ల్ ఇన్ నేపాల్…ఇండియన్ గర్ల్ ఇన్ ఇండోనేషియా అంటూ యూట్యూబ్‌ ఖాతాను నింపేసిన ఆ కిలాడి..ఇండియన్ గర్ల్ ఇన్ ISI అనే రహస్యాన్ని ఆలస్యంగా ఛేదించింది మన ఇంటిలిజెన్స్. ఒడిశాకు చెందిన మరో యూట్యూబర్ రాహుల్ సాహుతో కలిసి ఒక డిజిటల్ స్పై నెట్‌వర్క్‌నే నడిపింది మేడమ్ జ్యోతి. ఆమె ఛానెల్‌లో పాత వీడియోలను పరిశీలిస్తే, కొన్ని సీన్‌లలో ఆమె కోడ్‌వర్డ్‌లను మాట్లాడినట్లు అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు. “లైక్, షేర్, సబ్‌స్క్రైబ్… అంతా ఒక కవర్‌. ఇదంతా పాకిస్తానీ ఐఎస్‌ఐ ఏజెంట్లకు అర్ధమయ్యే కోడ్ భాష. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో కలిసి ఒక స్పై...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి