Viral Video: బైక్ స్టార్ట్ చేయబోయిన వ్యక్తికి మైండ్ బ్లాంక్.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూడగా..

ఓ వ్యక్తి బయటికి వెళ్లేందుకు తన బైక్ స్టార్ట్ చేయబోయాడు. దాని దగ్గరకు వెళ్లగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి..

Viral Video: బైక్ స్టార్ట్ చేయబోయిన వ్యక్తికి మైండ్ బ్లాంక్.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూడగా..
Viral Video

Updated on: Dec 15, 2022 | 1:35 PM

ఓ వ్యక్తి బయటికి వెళ్లేందుకు తన బైక్ స్టార్ట్ చేయబోయాడు. దాని దగ్గరకు వెళ్లగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడికి మైండ్ బ్లాంక్ అయింది. దెబ్బకు దడుసుకుని అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. ఇంతకీ అక్కడ అతడేం చూశాడంటారు.? అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మనేంద్రగఢ్ భరత్‌పుర్​చిర్మిరి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. స్కూటీలోకి దూరిన కొండచిలువ.. అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికులు వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించడంతో.. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ఆ తర్వాత సురక్షితంగా మనేంద్రగఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.