Viral Video: వరదల కారణంగా ముంబైలోని రైల్వే స్టేషన్ జలమయం.. ఈత కొడుతున్న యువకులు

|

Jul 08, 2023 | 8:26 AM

నిర్మాణంలో ఉన్న ఉరాన్ రైల్వే స్టేషన్ భవనంలో కొంత భాగం నీరు కారడంతో చిన్న చెరువుగా మారింది. స్థానిక యువకులు సరదాగా ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అయితే డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Viral Video: వరదల కారణంగా ముంబైలోని రైల్వే స్టేషన్ జలమయం.. ఈత కొడుతున్న యువకులు
Mumbai Floods
Follow us on

రుతుపవనాల రాకతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నవీ ముంబైలోని ఉరాన్ రైల్వే స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు దానిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వర్షం వీడియోల్లో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది యువకులు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్నారు. ఈ వర్షపు నీటిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వర్షం వస్తే అక్కడ ఏర్పడుతున్న పరిస్థితిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న ఉరాన్ రైల్వే స్టేషన్ భవనంలో కొంత భాగం నీరు కారడంతో చిన్న చెరువుగా మారింది. స్థానిక యువకులు సరదాగా ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అయితే డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం స్థానికులకు తెలియడం లేదని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

 

జితేంద్ర థాలే ఈ వీడియోను ట్వీట్ చేసి ప్రధాని మోడీని, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు వందల మంది చూశారు. 3 మంది రీట్వీట్ చేశారు.

ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న పిల్లలను తిట్టవచ్చు. ఈ ఎదిగిన యువత సంగతేంటి? ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..