దేవుడికి మొక్కు కోసం కోడిని తీసుకుని వెళ్తున్న వ్యక్తి ప్రమాదంలో మృతి .. రెండు రోజులైనా సంఘటనా స్థలం నుంచి కదలని కోడి

|

Nov 05, 2024 | 12:07 PM

ఇప్పటి వరకూ కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కోడి కూడా అనుకోవాలేమో.. ఒక కోడిని తీసుకుని వెళ్తున్న వ్యక్తీ ప్రమాదం జరిగి మృతి చెందాడు. రెండు రోజులుగా ఆ కోడి ప్రమాద స్థలం నుంచి కదలడం లేదు. ఒకవేళ ఎవరినా అక్కడికి వస్తే.. కొంచెం సమయం పక్కకు వెళ్తుంది. తిరిగి మళ్ళీ అదే చోటుకు వస్తుంది. ఈ వింత సంఘటన దక్షిణ కర్ణాటకలో చోటు చేసుకుంది.

దేవుడికి మొక్కు కోసం కోడిని తీసుకుని వెళ్తున్న వ్యక్తి ప్రమాదంలో మృతి .. రెండు రోజులైనా సంఘటనా స్థలం నుంచి కదలని కోడి
Viral News
Follow us on

దక్షిణ కన్నడ జిల్లా కడబ్ తాలూకాలోని పులికుక్కులో రోడ్డుమీద వెళ్తున్న ఓ స్కూటీపై చెట్టు కూలిపోయింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తీ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు ఎడమమంగళ గ్రామానికి చెందిన దేవస్య నివాసి సీతారామగౌడ్ గా గుర్తించారు. మృతుడు సీతారామ గౌడ్ తన ఇంట్లో జరగనున్న శుభకార్యం కోసం కోడిని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతారామగౌడ్ తీసుకుని వెళ్తున్న కోడి కాళ్లను తాళ్ళతో కట్టివేశాడు. దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాళ్లతో కట్టి ఉన్న కోడి ఆ మృతదేహం దగ్గర ఉండిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు కోడిని చూసి దాని కాలికి కట్టిన తాడును విప్పారు.

సంఘటనా స్థలంలో గుమిగూడిన ప్రజలు ఆ కోడిని చెదరగొట్టడంతో సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొంత సమయం తర్వాత ప్రమాదం జరిగిన స్థలంలోకి తిరిగి వచ్చింది. పాడైపోయిన సీతారామ స్కూటర్ మీదకు వచ్చి కూర్చువోడం మొదలు పెట్టింది. ఆ స్కూటర్ దగ్గరకు ఎవరైనా వస్తే సమీపంలోని చెట్టు కొమ్మపైకి చేరుకొని ఆశ్రయం పొందడం మొదలు పెట్టింది. ఇలా గత రెండు రోజులుగా జరుగుతూనే ఉంది. సీతారామ్ మరణించి రెండు రోజులు గడిచినా కోడి ఆ ఘటనా స్థలం నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు. దీంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. (దీంతో స్థానిక ప్రజలు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు). ఎందుకంటే ఈ కోడిని దేవుడికి మొక్కుని చెల్లించడానికి మృతుడు తీసుకుని వెళ్తున్నాడు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..