Delhi-Aurangabad Flight: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి, ఎంపీలు

ఢిల్లీ-ఔరంగాబాద్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యాడు. దీంతో అదే ప్లైట్ లో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి డాక్టర్‌ బీకే కరద్‌, బీజేపీ ఎంపీ డాక్టర్‌ సుభాష్‌ భామరెలు స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేశారు..

Delhi-Aurangabad Flight: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి, ఎంపీలు
Air India

Updated on: Jun 19, 2022 | 2:44 PM

Delhi-Aurangabad Flight: ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఢిల్లీ-ఔరంగాబాద్‌ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. అదే ఫ్లైట్‌లో ఉన్న కేంద్రమంత్రి డాక్టర్‌ బీకే కరద్‌, బీజేపీ ఎంపీ డాక్టర్‌ సుభాష్‌ భామరె వెంటనే అప్పమత్తమై సాటి ప్రయాణికుడికి వైద్య సేవలు చేశారు. విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురయిన విషయం తెలుసుకున్న సిబ్బంది వెటనే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ప్రకారం విమానంలో ఎవరైనా వైద్యులు ఉంటే చెప్పాల్సిందిగా ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సదరు మంత్రి, ఎంపీ వెంటనే స్పందించి ఆ వ్యక్తికి వైద్యసాయం చేయడానికి ముందుకు వచ్చారు.

సమయానికి ప్రయాణికుడికి వైద్యమందించి అతన్ని కాపాడిన మంత్రి  డాక్టర్‌ బీకే కరద్‌, ఎంపీ డాక్టర్‌ సుభాష్‌ భామరెలకు ఎయిర్‌ ఇండియా ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని.. ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేస్తోన్న పిక్ ని షేర్ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. విమానాల్లో వైద్యులను ఎందుకు నియమించుకోరని ప్రశ్నించారు. అదే సమయంలో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంపై సదరు విమానయాన సంస్థను తప్పుపట్టారు. మరికొందరు మంత్రి  డాక్టర్‌ బీకే కరద్‌, ఎంపీ డాక్టర్‌ సుభాష్‌లు స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..