Tamil Nadu Crime News: హిందువు సంప్రదాయంలో పండగలకు విశిష్ట స్థానం ఉంది. పండగ రోజున సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. సాంప్రదాయ పద్దతిలో కుటుంబ సభ్యులందరూ కలిసి పండగలను జరుపుకుంటారు. ఇక వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలు.. పిల్లలు, పెద్దలు చవితి పండగను జరుపుకోవడానికి రెడి అవుతారు. వినాయక మండపాలు, గణేశుడు విగ్రహం, పూజకు కావాల్సిన పత్రి, పూలు, పండ్లు, పిండివంటల వీటితో పాటు.. పిల్లలు కొత్త పుస్తకాలు, పెన్నులు, పిల్లలలు పెద్దలు కొత్తబట్టలు రెడీ చేసుకుంటారు. ఇక వినాయక చవితికి తన కుటుంబ సబ్యులకు కొత్తబట్టలు ఇవ్వాలనుకున్నాడు ఓ యువకుడు.. ఐతే కష్టపడి సంపాదించిన సొమ్ముతో కాకుండా షాప్ లో బట్టలు కొట్టేసి ఇవ్వాలనుకున్నాడు. బట్టలు దొంగలించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..
తిరునల్వేలి బస్టాండ్ సమీపంలోని ఓ బట్టల షాపు వినాయక చవితి సందర్భంగా రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో సెల్వమాధన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులకు కొత్త బట్టలను ఇవ్వాలనుకున్నాడు. అందుకని ఆ బట్టల షాపులోకి వెళ్లి వెళ్ళాడు. ట్రయల్ రూమ్ లో బట్టలను ట్రయిల్ వేయడానికి అంటూ.. పలుమార్లు బట్టలు తీసుకెళ్ళి .. అక్కడ లుంగీలో దాచుకున్నాడు. తర్వాత ఏమీ తెలియనట్లు షాపు నుంచి బయటపడాలని భావించాడు. అయితే సిబ్బందికి సెల్వమాధన్ ప్రవర్తనపై అనుమానం రావడంతో.. అతడిని తనిఖీ చేశారు. దీంతో సెల్వమాధన్ అడ్డంగా దొరికిపోయాడు.
Also Read :